Search
Friday 16 November 2018
  • :
  • :

రజనీకాంత్ కూతురి పాత్రలో హన్సిక!

hansika-Pathరజనీకాంత్ కొత్త చిత్రంలో హీరోయిన్‌గా ఎంపికవ్వడం పట్ల రాధికాఆప్టే ఎంతో సంతోషంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికరమైన వార్త తెలిసింది. కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న హన్సిక ఈ సినిమాలో రజనీకాంత్‌కు కూతురిగా నటించనుందట. ఇద్దరు భామల్లో ఒకరు భార్యగా మరొకరు కూతురిగా నటిస్తుండడం విశేషం. ఇంకా టైటిల్‌ను నిర్ణయించని ఈ సినిమాకు పిఎ రంజిత్ దర్శకత్వం వహించనున్నాడు. మలేషియాలో సెప్టెంబర్ నుంచి సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. ఈనెలలోనే సినిమా ప్రారంభం కావాల్సి ఉన్నా టీమ్ మెంబర్స్‌కు వీసా లభించకపోవడంతో చిత్రం షూటింగ్‌ను వాయిదావేసుకున్నారు. రజనీకాంత్ గ్యాంగ్‌స్టర్ రోల్‌లో నటించనున్నాడు. సంతోష్ నారాయణ్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రంలో. ప్రకాష్‌రాజ్, నాజర్ ప్రధాన పాత్రల్లో నటించనున్నారు.

Comments

comments