Search
Friday 16 November 2018
  • :
  • :

హను రాఘవపూడి  డైరెక్షన్‌లో నితిన్

Nithinదర్శకుడు హను రాఘవపూడి చెప్పిన కథ నచ్చింది… అందుకే ఈ సినిమా చేస్తున్నానంటూ ఇటీవల అఖిల్ అన్నాడు . ఇంతలో ఈ సినిమా ఆగిపోయిందంటూ టాక్ వచ్చింది. అఖిల్ డేట్స్ వేరే ప్రొడ్యూసర్ దగ్గర ఉండడం… అలాగే హను మాత్రం 14 రీల్స్ వారికి ఒక సినిమా చేయాల్సి రావడం… ఇద్దరి ప్రొడ్యూసర్ల మధ్యన సయోధ్య కుదరకపోవడంతో సినిమా ఆగిపోయిందట. కట్ చేస్తే… ఇప్పుడు ఇదే సినిమాను హీరో నితిన్ చేయడానికి ఓకే అన్నాడని అంటున్నారు ఫిల్మ్‌నగర్ వర్గాలవారు. హను రాఘవపూడి రెండు రోజుల క్రితం ఈ సినిమా కథను నితిన్‌కు చెప్పాడట. అంతేకాదు… అసలు నితిన్‌కు ఈ కథ చెప్పమని పంపించాడట అఖిల్. అయితే కథ విన్న నితిన్ ఈ సినిమాను తన బ్యానర్‌లో తానే ప్రొడ్యూస్ చేసుకుందాం అనుకున్నా కూడా… 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ వారు ఇచ్చిన భారీ రెమ్యునరేషన్ ఆఫర్‌తో ఇప్పుడు వాళ్ల బ్యానర్‌లోనే ఈ సినిమా చేయడానికి సిద్ధపడ్డాడట. గతంలో ఇలా ఒక హీరో నుండి ఇంకో హీరో చేతులు మారిన సబ్జెక్టులు చాలా వరకు హిట్టు కొట్టాయి. పైగా నితిన్ అంటేనే లవర్‌బాయ్ ఇమేజ్ ఉన్న హీరో. కాబట్టి హను రాఘవపూడి ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ తర్వాత చేయబోయే ఈ సినిమాతో ఖచ్చితంగా మెగా హిట్టు పడుతుందని అందరి అంచనా.

Comments

comments