Search
Wednesday 26 September 2018
  • :
  • :

కొండగట్టుపై హనుమాన్ చిన్న జయంతి వేడుకలు

H2

జగిత్యాల : కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో శనివారం హనుమాన్ చిన్న జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ నెల 29వ తేదీన ప్రారంభమైన ఉత్సవాలు ఏప్రిల్ 1వ తేదీన ముగియనున్నాయి. శనివారం నిర్వహించిన చిన్న జయంతి ఉతవ్సాలకు సుమారు లక్ష మంది హనుమాన్ దీక్షాపరులు తరలివచ్చారు. వారు స్వామివారికి ముడపులు చెల్లించి, మాల విరమణ చేసి అంజన్నను దర్శించుకోనున్నారు. ఆలయంలోని మూలవిరాట్‌కు ప్రత్యేక పూజలు , అభిషేకాలు చేశారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తాగునీటి సమస్యతో పాటు కోనేరులోకి నీటి సరఫరా లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. 300 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Hanuman Jayanti Celebrations held in Kondagattu Anjanna Temple

Comments

comments