Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

హాయిగా ఆఫీస్ పని..

officeచాలా మంది మహిళలు ఇంటిపని, ఆఫీస్ పని రెండింటిని సమన్వయం చేసుకోలేక ఒత్తిడికి లోనవుతుంటారు. ఆఫీస్‌లో చక్కని వాతావరణం ఉంటే ఇంటిపని కూడ సక్రమంగా చేసుకోగలరని నిపుణులంటున్నారు.
* రోజు ఆఫీస్‌కు వెళ్లగానే టీం సభ్యులందరితో కూర్చొని ఆ రోజు చేయాల్సిన పని సంబంధించిన విషయాలు మాట్లాడుకోవాలి. తరువాత పనులను విభజించుకోవాలి. దీని వలన పని భారం తగ్గుతుంది.
* నిర్విరామంగా పనిచేయకుండా మధ్య మధ్యలో సహోద్యోగులతో మాట్లాడుతూ జోకులు వేసుకోవడం, ఇతర అంశాలపై చర్చిచుకోవడం ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చు.
* నెలలో చేయవలసిన పనులు, లక్ష్యాలను ముందుగానే రాసిపెట్టుకోవాలి. అలాగే సహోద్యోగుల పుట్టినరోజులు, పెళ్లి రోజులు.. ఇలా ఏదో ఒక సందర్భంలో వేడుకలు చేసుకోవాలి. ఇలాంటి వాటి వలన టీం సభ్యుల మధ్య మంచి అనుబంధాలు ఏర్పడుతాయి. ఒకరిపై ఒకరికి అవగాహన కలుగుతుంది.
* ఏదైనా సమస్య వచ్చినప్పుడు తొటి వారితో చర్చించి.. సమస్యకు ఉన్న అన్ని కోణాలు పరిశీలించుకుంటే పరిష్కార మార్గాలు సులభంగా దొరుకుతాయి.
* పడుకునే ముందు చల్లటితో స్నానం చేసి.. మీ నచ్చిన పుస్తకం చదువుతూ లేదా మీ ఇష్టమైన పాటలు వింటూ పడుకోవడం వలన కూడా ఒత్తిడిని అధిగమించవచ్చు. మరునాడు హాయిగా ఆఫీస్‌కు వెళ్లవచ్చు.
* తోటి ఉద్యోగస్తులకు, స్నేహితులకు సహాయం చేసే స్వభావాన్ని పెంపొంచుకోండి. వారిని ఆందోళనకు గురిచేసే సందర్భలు, సమస్యలు వచ్చినప్పుడు మీరు కనీసం మాట సహాయం అయినా కొంత ఉపశమనాన్నిందన్న నమ్మకాన్ని వారికి కలుగ చేయాలి.
* ఉద్యోగ జీవితానికి, కుటుంబ జీవితానికి స్పష్టమైన విభజన రేఖ గీసుకోండి. మీరు చేసే పనికి పూర్తి సమయం కేటాయించడం వలన కుటుంబ జీవితం దెబ్బతినడమే కాకుండా ఆరోగ్యం పాడయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ రెండింటి మధ్య సమన్వయాన్ని సాధించాలి.
* పనిలో పడి రోజు వారి పనులు మరచిపోకుండా. ఫోన్‌లో రిమైడర్‌ను పట్టుకోండి లేదా తరచు మీ దృష్టి ఉండే ప్రదేశంలో విషయాలు కాగితంపై రాసి అతికించండి.
* ఏదైన పని చేసినప్పుడు వచ్చే పొగడ్తలు ఎలా స్వీకరిస్తామో… విమర్శలు కూడా అలానే స్వీకరించాలి. వాటిని సమన్వయం చేసుకున్నప్పుడే పని ఒత్తిడిని అధిగమించగలం. లేకపోతే ఆ ఆలోచనలు మీలో ఒత్తిడి పెంచి చేస్తున్న పని సాఫీగా చేయనివ్వవు.

Comments

comments