Home తాజా వార్తలు తారక్ హ్యాపీ బర్త్ డే….

తారక్ హ్యాపీ బర్త్ డే….

NTR

 

హైదరాబాద్: యంగ్ టైగర్ ఎన్‌టిఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పలువురు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.  జీవితంలో మరెన్నో విజయాలు అందుకోవడంతో పాటు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో జీవించాలని మనసారా కోరుకుంటున్నానని తారక్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు అంటూ  రామ్ చరణ్ తరుఫున ట్విట్టర్ లో ఉపాసన ట్వీట్ చేశారు. నా ప్రియమైన సోదరుడు ఎన్‌టిఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు అంటూ వైసిపి ఎంఎల్‌ఎ నాని తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశాడు. తారక్‌ను తమకు ఇచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతలు చెబుతున్నానని మ్యూజిక్ డైరెక్టర్ తమన్ పేర్కొన్నారు. రానా దగ్గుబాటి హ్యా బర్త్ డే బ్రదర్‌తో రాక్ ఆన్ సంభోదిస్తూ హ్యాపీ బర్త్ డే అంటూ రానా ట్వీట్ చేశాడు.  దర్శక ధీరుడు రాజమౌళి, హీరోయిన్లు భూమిక, ఇషారెబ్బా, టిడిపి నేత సిఎం రమేష్ సహా పలువరు సినీ, రాజకీయ ప్రముఖులు ఎన్‌టిఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.