Home వార్తలు హ్యాపీ హ్యాపీగా అలియాభట్

హ్యాపీ హ్యాపీగా అలియాభట్

alia-bhattబాలీవుడ్ యంగ్ హీరోయిన్ అలియాభట్ ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. ఈ భామ నటించిన ‘ఉడ్తా పంజాబ్’ చిత్రం విడుదలకు సిద్ధమవడం… తాజాగా విడుదలైన ఈ మూవీ ట్రైలర్‌కు విపరీతమైన స్పందన రావడమే ఇందుకు కారణం. రిలీజ్‌కు ముందే మంచి టాక్ రావడమంటే మామూలు విషయం కాదు. ఈ సినిమా కోసం ప్రత్యేకంగా బిహారీ భాష నేర్చుకుంది. అక్కడి స్థానికులు ముఖ్యంగా పల్లెటూరి జనాలు మాట్లాడుకునే యాసను నేర్చుకొని మరీ డబ్బింగ్ చెప్పడం…ఈ మూవీలో మెయిన్ అట్రాక్షన్. ‘ఉడ్తా పంజాబ్’ విడుదలకు మరో రెండు నెలల సమయం ఉండగానే.. తన పాత్రకు తొలిసారిగా ఇంత క్రేజ్ రావడం ఈ అమ్మడిని ఆనందంలో ముంచెత్తింది. ఈ సంతోషాన్ని తెగ ఎంజాయ్ చేస్తోంది. తాజాగా అలియాభట్ తన ఫ్రెండ్స్‌తో కలిసి స్విమ్మింగ్ పూల్‌లో కేరింతలు కొట్టింది. సినిమా ట్రైలర్‌కు వస్తున్న రెస్పాన్స్ తనను ఆనందంలో ముంచెత్తుతోందని చెబుతోంది.