Search
Saturday 22 September 2018
  • :
  • :

తెల్లారితే ఉల్లాసంగా ఉండాలంటే…

Smile

ఈ రోజుల్లో కొందరికి పనులను వాయిదా వేసుకోవడం అలవాటు అయ్యింది. రేపు చేసేద్దాం లే అనుకుంటుంటారు. రోజంతా పనుల్ని చేయకపోవడం వల్ల రాత్రి పడుకునేముందు…. చాలా పనులు మిగిలి ఉన్నాయి, తొందరగా లేచి ఆ పనుల్ని చేసుకోవాలని అనుకుంటూ నిద్రపోతారు. అయితే, అప్పటికి బాగానే అనిపిస్తుంది. కానీ పొద్దున లేచేటప్పటికి అవే ఒత్తిడిని పెంచుతాయి. ఉన్న కాస్త సమయంలోనే అన్ని పనుల్నీ పూర్తిచేయగలమా అన్న ఆందోళనకు గురవుతాం కదా. ఇలాకాకుండా, సమయం, ఓపికా ఉంటే ఎప్పటి పనుల్ని అప్పుడు పూర్తిచేసుకోవడమే మంచిది. దీంతో ఎలాంటి ఒత్తిడి, ఆందోళనకు గురికాము. మర్నాడు కాస్త ఆలస్యంగా లేచినా ఉత్సాహంగా రోజుని ప్రారంభించగలుగుతాం. అంతేగాకుండా మనసు మరింత ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండాలంటే కొన్ని నియమాలు పాటిద్దాం.
* పొద్దున లేవగానే పూలని చూడటం వల్ల మనసు ఉత్తేజితం అవుతుందని హార్వర్డ్ యూనివర్సిటీ నిపుణులు చెబుతున్నారు. అందుకేం చేయాలంటే… హాల్లో టేబుల్ లేదా భోజనాల బల్ల మీద పూలగుత్తులు ఉండేలా ఏర్పాటు చేసుకుంటే సరిపోతుంది. నేరవార్తలూ, అరుపులతో కూడుకున్న టీవీ కార్యక్రమాలు, సినిమాలూ నిద్రపోవడానికి అరగంట ముందే ఆపేయాలి. అవన్నీ ప్రతికూల భావాలకు కారణమవుతాయి. మీకు నచ్చిన సంగీతాన్ని విని పడు కుంటే హాయిగా నిద్రపడుతుంది. తెల్లారి లేచేటప్పుడే ఇక ఉత్సాహంగా ఉంటుంది.

Comments

comments