Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

2018 ప్రపంచానికి కొత్త కళ

Happy-new-Year

న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరుగు తున్నాయి. 2017కి వీడ్కోలు పలుకుతూ 2018 కి స్వాగతం పలుకు తున్నాయి. 2018 కి స్వాగతం పలికిన దేశాల్లో ముందుగా టోంగా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు ఉన్నాయి. ఆ తర్వాత జపాన్, దక్షిణ కొరియా, ఉత్తర కొరియాలు కొత్త సంవత్సర వేడుకల్లో మునిగి తేలాయి. భారత్ కన్నా ఏడున్నర గంటలకు ముందే న్యూజిలాండ్‌లో నూతన సంవ త్సర వేడుకలు ప్రారంభమయ్యాయి.న్యూజిలాండ్ తర్వాత ఆస్ట్రేలియా వాసులు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికారు. భారత్ కన్నా ముందే దాదాపు 12 దేశాలు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికాయి.

ఆక్లాండ్‌లో ఘనంగా వేడుకలు : న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో కొత్త సంవత్సర వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కళ్లు చెదిరేలా బాణాసంచా కాల్చుతూ ఆక్లాండ్ ప్రజలు నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు.ఆక్లాండ్ హార్బర్‌లో ఫెర్రీలో ప్రయాణం చేస్తూ కొందరు వేడుకలను తిలకించారు. అదే విధంగా స్కై టవర్ వద్ద జరిగిన వేడుకలు ప్రజలను కట్టిపడేశాయి. వెల్లింగ్‌టన్ వద్ద కూడా కళ్లు చెదిరే రీతిలో బాణాసంచా కాల్చి ప్రజలు తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఆస్ట్రేలియాలో వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇటీవలే గే వివాహాలను చట్ట బద్ధం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకో వడంతో సంబరాలు అంబరాన్నం టాయి. సిడ్నీ హార్బర్ బ్రిడ్జి, సిడ్నీ ఓపెరా హౌస్ తదితర ప్రాంతాలు ప్రజల తో కిక్కిరిసి పోయాయి. వేడుకలను చూసేందుకు లక్షలాదిగా ప్రజలు ఆ యా ప్రాంతాలకు తరలివచ్చారు. మెల్‌బోర్న్, హోబార్ట్, కాన్ బెర్రా ప్రాంత ప్రజలు కూడా బాణాసంచా కాల్పులతో హోరెత్తించారు. నూతన సంవ త్సరానికి తమదైన శైలిలో స్వాగ తం పలికారు. మెల్ బోర్న్‌లోని ఎర్రా నదిపై జరిగిన వేడుకలు ప్రజలను విశేషంగా ఆకట్లుకున్నాయి. సింగపూ ర్‌లోని మెరీనా బే కొత్త సంవత్సర వేడుకలకు ప్రధాన ఆకర్షణగా నిలిచిం ది. ఆ ప్రాంతమంతా బాణాసంచా వెలుగులతో కాంతివంతంగా మారింది.

Comments

comments