Home జనగామ కుటుంబ సభ్యులతో నూతన సంవత్సర వేడుకలు

కుటుంబ సభ్యులతో నూతన సంవత్సర వేడుకలు

Warangal-PSలింగాలఘణపురం : నూతన సంవత్సర వేడుకలు మద్యంతో కాకుండా, కుటుంబ సభ్యుల నడుమ సంతోషంగా నిర్వహించుకోవాలని వరంగల్ పోలీస్ కమీషనరేట్ సూచన మెరకు మండల కేంద్రంలో శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్‌ఐ వేణుగోపాల్ రావు పాల్గొని మాట్లాడుతూ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా వరంగల్ కమీషనరేట్ పరిధిలో వాహనాల ప్రమాద, ప్రాణ రక్షణ కొరకు శనివారం రాత్రి 10 గంటల నుండి ఉదయం 4 గంటల వరకు విసృతంగా అన్ని ప్రాంతాల్లో మోబైల్ పోలీస్ బృందాలతో డ్రింక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించబడుతాయన్నారు. ఈ తనిఖీల్లో మధ్యం సేవించి వాహనం నడిపినట్లు నిరూపన జరిగితె వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా వాహనదారులను కోర్టులో హాజరు పర్చడంతో పాటు తగిన జరిమాన, జైలు శిక్ష విదించడంతో పాటు మద్యం సేవించి వాహనం నడపడం ద్వారా మీ ప్రాణా రక్షణతో పాటు ఇతరుల ప్రాణాలకు ప్రమాదం వాటిల్లును కావున మీ వాహనంను స్వాదీనం చేసుకోవడం జరుగుతుందని అన్నారు.  కోర్టులో శిక్షకు గురైన వాహన దారులు ఇకపై ఉన్నత చదువులు, ప్రభుత్వ ఉద్యోగాలు, పాస్‌పోర్ట్ పొందడంలో ఇబ్బందులకు గురౌతారని అనె ప్లెక్సిని ఏర్పాటు చేస్తామన్నారు.