Search
Tuesday 20 November 2018
  • :
  • :
Latest News

28న పెళ్లి ముహూర్తం

Happy-Wedding

పెళ్లంటే నూరేళ్ల పంట అని అంటారు. జీవించినంత కాలం ఒకరినొకరు అర్థం చేసుకొని ఎటువంటి మనస్పర్థలు రాకుండా జీవించాలని దాని అర్థం. పెద్దలు పెళ్లికి చక్కటి ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. అలాంటి ముహుర్తాన్ని యువి క్రియేషన్స్, పాకెట్ సినిమా వారు కలిసి సుమంత్ అశ్విన్, నిహారికల ‘హ్యాపి వెడ్డింగ్’కు ఈనెల 28గా నిర్ణయించారు. త్వరలోనే సంగీత్ కార్యక్రమాలు (సాంగ్స్ విడుదల), ప్రీ వెడ్డింగ్ (ప్రీ రిలీజ్ ఫంక్షన్)ని అత్యంత గ్రాండ్‌గా చే యాలని నిర్ణయించారు. సుమంత్ అశ్విన్ వరుడుగా, నిహారిక కొణిదెల వధువుగా నటించిన చిత్రమిది. పురోహితుడిగా యంగ్ డైరెక్టర్ లక్ష్మణ్ కార్య ఈ వివాహాన్ని చేస్తున్నాడు. మంగళవాయిద్యాలు (సంగీతం) శక్తికాంత్ అందించగా, ఆర్కెస్ట్రా (రీరికార్డింగ్) ఎస్.ఎస్.తమన్ అందిస్తున్నారు. దర్శకుడు లక్ష్మణ్ కార్య మాట్లాడుతూ “పెళ్లి కుదిరిన రోజు నుండి పెళ్లి జరిగే రోజు వరకు రెండు కుటుంబాల మధ్య, రెండు మనసుల మధ్య ఏం జరుగుతుందనే విషయాన్ని సినిమాలో చాలా అందంగా చూపించాం. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి అనుభవం ఉంటుంది. ఈనెల 28న సినిమా విడుదలకానుంది”అని అన్నారు.

Comments

comments