Search
Monday 24 September 2018
  • :
  • :
Latest News

హక్కానీ నెట్‌వర్క్ కమాండర్ హతం

DRONE-

పాక్ : యుఎస్ డ్రోన్ దాడిలో హక్కానీ నెట్‌వర్క్ కమాండర్ ఇషాన్ అలియాస్ ఖ్వారీతో పాటు ఆయన సహాయకులు ఇద్దరు హతమయ్యారు. పాక్ – ఆఫ్గాన్ సరిహద్దు ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. స్పీస్‌తాల్ ప్రాంతంలో ఉన్న ఓ ఇంట్లో వీరు దాగి ఉన్నారన్న సమాచారం అందడంతో యుస్ స్పై విమానాలు డ్రోన్ సాయంతో మిస్సైల్ దాడి చేశాయి. ఈ దాడిలో ఇషాన్‌తో పాటు అతడి సహాయకులు ఇద్దరు చనిపోయినట్టు యుఎస్ అధికారులు తెలిపారు. ఈ డ్రోన్ దాడిపై పాక్ స్పందించింది. తమ భూభాగంలో జరిగిన ఈ దాడి పాక్ సౌరభౌత్వాన్ని ఉల్లంఘించడమేనని పాక్ ఆరోపించింది. 2016లో కూడా ఇటువంటి డ్రోన్ దాడి చేశారు. నాటి దాడిలో తాలిబన్ నేత ముల్లాహ్ అక్తర్ హతమైన విషయం తెలిసిందే.

Haqqani Network Commander Encounter

Comments

comments