Home తాజా వార్తలు ప్రేమ పేరుతో వేధింపులు…

ప్రేమ పేరుతో వేధింపులు…

Loveహైదరాబాద్ : ఓ వివాహితను ప్రేమ పేరిట వేధించాడో యువకుడు. అయితే తన ప్రేమను అంగీకరించని ఆ వివాహితపై కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. ఫిలింనగర్ ఏరియాలోని వినాయకనగర్ లో నివసించే 26 ఏళ్ల యువతికి పెళ్లికి ముందు టోలిచౌకి ఏరియాకు చెందిన ఆసిఫ్ (24)తో పరిచయం ఉంది. పెళ్లి తరువాత ఆమె తన భర్తతో కలిసి జీవిస్తోంది. అయితే ఆసిఫ్ ఆ యువతిని ప్రేమించాలని వేధిస్తూ వస్తున్నాడు. దీంతో ఆ యువతి ఈ విషయాన్ని తన బావకు చెప్పింది. దీతో అతడు ఆసిఫ్ ను నిలదీశాడు. ఈ క్రమంలో ఆమెపై కసి పెంచుకున్న ఆసిఫ్ సోమవారం రాత్రి ఆ వివాహితపై కత్తితో దాడి చేసి గాయపర్చాడు. అనంతరం ఆసిఫ్ అక్కడి నుంచి పరారయ్యాడు. సదరు వివాహితను ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేశారు. ఆసిఫ్ ఆరు మాసాల క్రితమే ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఆసిఫ్ ను అరెస్టు చేశామని, ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Harassment In Name Of Love