Home తాజా వార్తలు శాస్త్ర , సాంకేతిక రంగంలో కృషి : చంద్రబాబు

శాస్త్ర , సాంకేతిక రంగంలో కృషి : చంద్రబాబు

cm-babu

తిరుపతి : శాస్త్ర సాంకేతిక రంగంలో భారతీయులు కృషి ఎంతో చేస్తున్నారని ఎపి సిఎం చంద్రబాబునాయుడు అన్నారు. ఐదు రోజుల పాటు జరిగే 104వ సైన్స్ కాంగ్రెస్ సదస్సు తిరుపతిలోని ఎస్‌వియూ వేదికగా సోమవారం ప్రారంభమైంది. నోట్ల రద్దు, జిఎస్‌టి బిల్లు అనే రెండు ప్రధాన నిర్ణయాలను ప్రధాని తీసుకున్నారని ఆయన తెలిపారు. నోట్ల రద్దు, జిఎస్‌టి అనేవి దేశ ఆర్థిక రంగంలో విప్లవాలు తెస్తాయని స్పష్టం చేశారు. నోట్ల రద్దు నిర్ణయం వల్ల రాజకీయ అవినీతిని కూడా నియంత్రించొచ్చని ఆయన పేర్కొన్నారు. ఈ నిర్ణయంతో ఉగ్రవాదాన్ని కూడా నివారించొచ్చని ఆయన తెలిపారు.