Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

కృషి, పట్టుదల ఉంటే.. విజయం తథ్యం

M-Sridharనాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ ఎం.శ్రీధర్

మన తెలంగాణ/ నాగర్‌కర్నూల్: కృషి, పట్టుదల ఉంటే చేసే పనిలో విజయం సాధించవచ్చని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ ఎం.శ్రీధర్ అన్నారు. స్థానిక కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ఆదివారం జరిగిన మహర్షి వాల్మీకి జయంతి సభలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.  మహర్షి వాల్మీకి గురించి భిన్న కథ నాలున్నా అవిద్యావంతుడైనప్పటికీ పట్టుదల కృషితో రామాయణం రచించి మహర్షిగా గుర్తింపు పొం దాడన్నదే వాస్తవమన్నారు. వాల్మీకిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరూ రోజువారీ కార్య క్ర మాల్లో నిబద్దత, పట్టుదల చూపగలిగితే  సత్ఫలితాలు సాధించగలుగుతామన్నారు. తమ చుట్టూ జరు గుతున్న సంఘటనల పట్ల స్పందించే గుణం అలవర్చు కోవాలని, నా కేమి లభించిందన్నదిగాక తానేమి మొదటిపేజీ తరువాయి…చేయగలను తానేమి ఇవ్వగలనన్న ఆరోగ్యకరమైన ఆలోచనతో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపు నిచ్చారు. జిల్లా ఎస్పి కల్మేశ్వర్ సింగనవార్ మాట్లాడుతూ సమాజంలోని చెడును విడిచి సన్మార్గంలో నడిచేందుకు వాల్మీకిని ఆదర్శంగా తీసు కోవాలన్నారు. జడ్పిటిసి కొండా మణెమ్మ మాట్లాడుతూ పుట్టుక, కులం, ప్రవర్తనలతో ఏ ఒక్కరి ప్రతిభనూ అంచనా వేయలేమన్న విషయానికి మహర్షి వాల్మీకి నిదర్శనమని చెప్పారు. ప్రతి ఒక్కరిలో ప్రతిభ ఉంటుందని, దానిని వెలికి తీసేందుకు ప్రయత్నాలు జరగాలని అభిప్రాయ పడ్డారు. ఎంపిపి బండి శాంతమ్మ వాల్మీకి మహర్షిపై పాటపాడి సభికులను అలరించారు. వాల్మీకి సంఘం నాయకుడు యశ్వంత్ మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా జయంతి నిర్వహించడం హర్షణీయమని, దీంతోపాటు బోయలను ఎస్టిలలో చేర్చాలని ఎంతోకాలంగా ఉన్న తమ డిమాండ్‌ను కూడా ప్రభుత్వం తీర్చాలని కోరారు. సమావేశానికి జిల్లా బిసి అభివృద్ధి అధికారి రాజేందర్ అధ్యక్షత వహించగా హాస్టల్ వెల్ఫేర్ అధికారిణి చిలకమ్మ వాల్మీకి చరిత్ర గురించి వివరించారు. జిల్లా జాయింట్ కలెక్టర్ సురేందర్ కరణ్ పాల్గొన్నారు.

Comments

comments