Search
Friday 16 November 2018
  • :
  • :

హార్దిక్ హాఫ్‌సెంచరీ.. భారత్ 185/7

Hardik-Pandya

కేప్‌టౌన్: వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆటలో భారత బ్యాట్స్‌మెన్లు వరుసగా పెవిలియన్‌కు క్యూ కడుతున్న క్రమంలో ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీతో ఆదుకున్నాడు. దూకుడుగా ఆడిన పాండ్యా 46 బంతుల్లోనే అర్ధశతకం నమోదు చేశాడు. మరోవైపు పేసర్ భువనేశ్వర్ కుమార్ కుదురుగా ఆడుతున్నాడు. పాండ్యాకు చక్కని సహకారం అందిస్తున్నాడు. ఈ జోడీ అజేయంగా 93 పరుగుల భాగస్వామ్యం అందించింది. సఫారీ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 286 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. దీంతో భారత్ ఇంకా 101 పరుగులు వెనుకబడి ఉంది. ప్రస్తుతం క్రీజులో పాండ్యా(81), భువనేశ్వర్(24) ఉండగా.. టీమిండియా స్కోర్: 185/7(61 ఓవర్లు).

Comments

comments