Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

హార్దిక్ పటేల్‌కు 2 ఏళ్ల జైలు శిక్ష

2015 Patidar agitation: Hardik Patel jailed for 2 years

అహ్మదాబాద్: గుజరాత్‌లోని పాటిదార్ అనామత్ ఆందోళన్ సమితి కన్వీనర్ హార్దిక్ పటేల్‌కు రెండు సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ స్థానిక విస్ నగర్ సెషన్స్ కోర్టు బుధవారం తీర్పును వెల్లడించింది. 2015లో పటేళ్లకు రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ తో నిరసనలు చేపట్టి, భారీ మొత్తంలో ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించిన కేసులో హార్దిక్ ను న్యాయస్థానం దోషిగా తేల్చింది. పటేల్ సామాజిక వర్గానికి చెందిన యువతను ఆయనే విధ్వంసానికి ఉసిగొలిపారంటూ సంఘటనలకు సంబంధించిన వీడియో సాక్ష్యాలను, పత్రికల్లో వచ్చిన వార్తలు, వాట్స్ యాప్ గ్రూపుల్లో వైరల్ అయిన పోస్టులు, ఆపై విచారణ సందర్భంగా వెల్లడైన వాస్తవాలను పోలీసులు కోర్టు ముందుంచారు. ఈ కేసులో దాదాపు రెండున్నరేళ్లుగా విచారణ జరిగింది. విచారణ అనంతరం హార్దిక్ ను దోషిగా తేల్చిన కోర్టు 2 సంవత్సరాల కారగార శిక్షను విధించింది. అయితే, హార్దిక్ పైకోర్టుకు అపీల్ చేసుకోవచ్చని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి తెలిపారు.

Comments

comments