Home తాజా వార్తలు ‘ఎన్ టిఆర్’ లో హరికృష్ణను చూశారా..!

‘ఎన్ టిఆర్’ లో హరికృష్ణను చూశారా..!

bly
నంద‌మూరి నటసింహం బాల‌కృష్ణ, క్రియేటీవ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో నందమూరి తారకరామారావు జీవితం ఆధారంగా  ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఎన్ టి ఆర్‌’.  కాగా, ఈ చిత్రానికి సంబంధించిన ఒక్కో పాత్రను చిత్రయూనిట్ రివీల్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే ఎన్ టిఆర్ సతీమణి పాత్రలో విద్యాబాలన్, చంద్రబాబు పాత్రలో రానా, నాగేశ్వరరావు పాత్రలో సుమంత్, శ్రీదేవి పాత్రలో రకుల్ ప్రీత్‌సింగ్‌లపై చిత్రీకరణ జరిగింది. తాజాగా ఈ చిత్రాలోని హరికృష్ణ పాత్రలో నటిస్తున్న లుక్ ను నందమూరి కల్యాణ్ రామ్ విడుదల చేశారు.  హరికృష్ణ పాత్రకు సంబంధించిన పోస్టర్ ను కల్యాణ్ రామ్ ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేశాడు.
30 ఏళ్ల క్రితం మా బాబాయ్‌తో ‘బాలగోపాలుడు’ సినిమాలో బాలుడిలా నటించాను. మళ్లీ ఇప్పుడు.. ‘బాబాయ్, వాళ్ల నాన్న గారిలా… నేను, మా నాన్నగారిలా’ ఎన్ టి ఆర్ బయోపిక్‌లో నటిస్తున్నానంటూ కల్యాణ్ రామ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.  ఎన్నికల ప్రచారంలో చైతన్య రథాన్ని వేల కిలోమీటర్లు నడిపిన హరికృష్ణ పాత్రలో తాను నటిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.  ప్రస్తుతం ‘ఎన్ టిఆర్ ’ సెట్స్‌లో జాయిన్ అయినట్లు కల్యాణ్ రామ్ ట్వీట్ చేశారు. ఈ చిత్రానికి కీర‌వాణి సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెర‌కెక్కిస్తున్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జనవరి 9న కథానాయకుడు, జనవరి 24న మహానాయకు డుగా విడుదల చేయనున్నారు.
 Harikrishna character rivil from movie of NTR

 of NTR