Home తాజా వార్తలు ముగిసిన హరికృష్ణ అంత్యక్రియలు…

ముగిసిన హరికృష్ణ అంత్యక్రియలు…

Harikrishna funeral is over

హైదరాబాద్: దివంగత నందమూరి హరికృష్ణ అంత్యక్రియలు ముగిశాయి. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో హరికృష్ణ అంతిమ సంస్కారాలను నిర్వహించారు. హరికృష్ణ చితికి ఆయన రెండో కొడుకు కల్యాణ్‌రామ్ నిప్పటించారు. మెహిదీపట్నం నుంచి జూబ్లీహిల్స్ మహాప్రస్థానం వరకు హరికృష్ణ అంతిమయాత్ర కొనసాగింది. హరికృష్ణ అంత్యక్రియల్లో ఎపి సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం కెఇ కృష్ణమూర్తి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. అంతిమయాత్రలో నందమూరి అభిమానులు, టిడిపి శ్రేణులు భారీ సంఖ్యలో పాల్గొని హరికృష్ణకు నివాళులర్పించారు.