Home జాతీయ వార్తలు హరికృష్ణ అంతిమయాత్ర ప్రారంభం

హరికృష్ణ అంతిమయాత్ర ప్రారంభం

Harikrishna Last Journey Start

హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నటుడు, మాజీ మంత్రి నందమూరి హరికృష్ణ అంతిమయాత్ర ప్రారంభమైంది. మెహదీపట్నంలోని టోలిచౌకీలో ఉన్న ఆయన నివాసం నుంచి అంతిమయాత్ర ప్రారంభమైంది. ఆయన అంతిమయాత్రలో భాగంగా ఎపి సిఎం, టిడిపి జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, జస్టిస్ జాస్తి చలమేశ్వర్ పాడె పట్టారు. హరికృష్ణ కొడుకులు కల్యాణ్‌రామ్, జూనియర్ ఎన్‌టిఆర్‌లు బోరున విలపించడం చూపరులను ఆవేదనకు గురి చేసింది. ప్రభుత్వ అధికార లాంఛనాలతో జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో హరికృష్ణ అంత్యక్రియలు జరగనున్నాయి.

Harikrishna Last Journey Start