Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

మృతుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం…

harish-rao

సిద్దిపేట: గజ్వేల్ మండలం రిమ్మనగూడ దగ్గర రాజీవ్ రహదారిపై శనివారం సాయత్రం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 10 మంది ఘటన స్థలిలోనే మృత్యువాత పడ్డారు. కాగా ఓంకార్ (11) గాంధీ దవాఖానలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. దీంతో మృతుల సంఖ్య 11 చేరింది. ఆర్టీసి బస్సు, లారీ, కంటెయినర్, క్వాలిస్ ఒకదాన్ని మరోకటి ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిందని తెలిసినా వేంటనే హూటాహూటినా మంత్రి హరీశ్ రావు సంఘటనా స్థలానికి వెళ్లారు. అనంతరం గజ్వేల్ లోని వైద్యశాలకు చేరుకొని ప్రమాద బాధితులను పరామర్శించారు. మంత్రితో పాటు కలెక్టర్ వెంకట్రామిరెడ్డి కూడా వెళ్లారు. మృతుల కుంటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని హరీశ్ రావు హామీ ఇచ్చారు. ఆర్టీసి, జీవిత బీమా నుంచి కూడా ఆర్థిక సాయం అందేలా చర్చలు తీసుకుంటామని ఆయన చెప్పారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లను మంత్రి ఆదేశించారు.

harish-rao-image

Comments

comments