Home తాజా వార్తలు చంద్రబాబుకు ఈర్ష్య ఎందుకు.?

చంద్రబాబుకు ఈర్ష్య ఎందుకు.?

harish-rao-fire-on-chandra-
సిద్ధిపేట: ఎపి సిఎం చంద్రబాబుపై తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టుకుంటే ఆయనకేం నష్టమని హరీశ్ రావు ప్రశ్నించారు. గతంలో కూడా బాబు తెలంగాణ రాకుండా అడ్డుపడ్డారని ఆయన ధ్వజమెత్తారు. రాత్రనక పగలనక కష్టపడి ప్రాజెక్టును కడుతుంటే చంద్రబాబుకు అంతా ఈర్ష్య ఎందుకు కలుగుతుందని మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ప్రాజెక్టు పనులను ఆపాలంటూ కేంద్రానికి బాబు ఫిర్యాదు చేశారని చెప్పారు. స్వరాష్ట్రం తెచ్చుకున్నదే నీటి కోసమేనని స్పష్టం చేశారు. గోదావరిలో 954 టిఎంసిల వాటా తెలంగాణకు ఉందని ఆయన గుర్తుచేశారు. ప్రాజెక్ట్  పనుల విషయంలో ఎవరు అడ్డుతగిలినా కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి, తెలంగాణ రైతాంగానికి నీళ్లు ఇచ్చితీరుమని భరోసా ఇచ్చారు.