Home రాష్ట్ర వార్తలు రాహుల్ సభతో హరీశ్ మెంటల్‌గా మారారు : జగ్గారెడ్డి

రాహుల్ సభతో హరీశ్ మెంటల్‌గా మారారు : జగ్గారెడ్డి

Jagga-Reddy

సంగారెడ్డి : సంగారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ ప్రజాగర్జన సభ సక్సెస్‌తో మంత్రి హరీశ్ రావు మెంటల్‌గా మారారని కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఎద్దేవా చేశారు. రాహుల్‌గాంధీ హాజరైన సభను చూసి టిఆర్‌ఎస్ నేతల గుండెల్లో దడ మొదలైందని అన్నారు. సంగారెడ్డిలో హరీశ్‌రావు కాంగ్రెస్ నాయకులను వేధిస్తున్నారని, ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని హితవుపలికారు. అమీన్‌పూర్ భూముల కేసులో తన తప్పేమీ లేదని ఆయన పేర్కొన్నారు. కేసులు పెడితే తన దమ్మేంటో టిఆర్‌ఎస్‌కు చూపిస్తానని అన్నారు. తనపై కేసులు పెట్టిన మరుసటి రోజు నుంచి అధికార పార్టీ నేతలకు నిద్ర లేకుండా చేస్తానని హెచ్చరించారు.