Search
Saturday 17 November 2018
  • :
  • :

మహానది గోదావరి తొలుత చేపట్టాలి

రాష్ట్రాల్లోని నదులు కలపడంపైనా యోచించాలి
ఢిల్లీ జాతీయ జల అభివృద్ధి సమావేశంలో హరీశ్

Harish-Rao

న్యూఢిల్లీ : నదుల అనుసంధానంలో భాగంగా ముందు గా మహానదిగోదావరిలను కలపాలని మంగళవారం ఢిల్లీలో జరిగిన 31 వ జాతీయ జల అభివృద్ధి సంస్థ (నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెనీ) సమావేశంలో కేంద్రప్రభుత్వానికి రాష్ట్ర నీటి పారుదల శాఖమంత్రి హరీశ్ రావు సూచించారు. సోమవారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో కేంద్ర జలవనరుల శాఖ ఆధ్వర్యంలో జరిగిన 31 నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజె న్సీ సమావేశంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. కేంద్ర జలవనరుల శాఖ మం త్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అన్ని రాష్ట్రాల నీటి పారుదల శాఖ మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరుపున పాల్గొన్న హరీశ్‌రావు మీడియాతో మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా నదుల అనుసంధానంపై నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగిందని, రాష్ట్రం తరుపున పలు అభిప్రాయాలను వ్యక్తం చేశామని మంత్రి తెలిపారు.  నితిన్ గడ్కరీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పనితీరును అభినందించారని మంత్రి పేర్కొన్నారు.  మిషన్ కాకతీయ,  పెద్ద ఎత్తున నీటి పారుదల ప్రాజెక్టుల అభివృద్ధికి ముఖ్యమంత్రి చేస్తున్న కృషిని ఈ సమావేశంలో గడ్కరీ ప్రశంసించారని మంత్రి తెలిపారు. మొట్టమొదట మహానదిగోదావరిని అనుసంధానం చేయాలనే అభిప్రాయం వ్యక్తం చేశామని మంత్రి తెలిపారు. ఇందుకు సంబంధించి ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌తో కేంద్ర ప్రభుత్వం చర్చించి మహానది గోదావరి అనుసంధానంపై ఒప్పించాలని కోరామని మంత్రి వివరించారు. రెండు, మూడు రాష్ట్రాల  మధ్య నదుల అనుసంధానంలో భిన్న  రాష్ట్రాలు, భిన్న పార్టీల వైఖరుల వల్ల రాజకీయ చిక్కులు ఎదురతున్నాయని, ఇలాంటి సందర్భంలో ఇంటర్ లింకింగ్‌తో పాటు, ఇంట్రా లింకింగ్‌పై ఆలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించామని మంత్రి తెలిపారు. ఒకే రాష్ట్రంలోని ఒక చోటు నుంచి నీటిని మరొక చోటుకి తీసుకువెళ్లేలా కేంద్ర ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి  చేశామని , కృష్ణా నది పరీవాహ ప్రాంతమైన శ్రీశైలం, నాగార్జున సాగర్‌లో నీళ్లు రాని పరిస్థితి  ఉంటే, గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయని ఈ విషయాన్ని సమావేశంలో అందరి దృష్టికి తీసుకెళ్లామని  తెలిపారు. ప్రస్తుతం గోదావరి లోని నీటిని కృష్ణా పరీవాహక ప్రాంతంలోకి  మళ్లించేలా కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరామని  మంత్రి తెలిపారు. ఇలా రాష్ట్రంలోని ఒక ప్రాంతంలోని నీటిని మరొక ప్రాంతానికి మళ్లించేలా ఏర్పాటు చేసే ఇంట్రా లింకింగ్ వ్యవస్థపై  రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకు వస్తాయని, ఈ వ్యవస్థతో అన్ని ప్రాంతాలకు నీరు అందడమే కాకుండా కేంద్ర ప్రభుత్వ లక్షం వేగవంతమవుతుందని మంత్రి తెలిపారు. తాము వ్యక్తం చేసిన అభిప్రాయాలపై స్పందించిన కేంద్ర జలవనరుల శాఖ మంత్రి  రానున్న రోజుల్లో నదుల అనసంధానంపై బృహత్తర ప్రాజెక్టును చేపట్టనున్నట్లు తెలిపారని మంత్రి హరీశ్ రావు వివరించారు. ఈ ప్రాజెక్టులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు  90:10 శాతంతో పనులు చేయాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వివరించారని  హరీశ్ రావు తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి హరీశ్ రావుతో పాటు, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, పలువురు పాల్గొన్నారు.

Comments

comments