Home తాజా వార్తలు అధైర్య పడకండి… అండగా ఉంటాం: మాజీ మంత్రి హరీశ్‌రావు

అధైర్య పడకండి… అండగా ఉంటాం: మాజీ మంత్రి హరీశ్‌రావు

Harish Rao poised to farmers for damaged crops

 

సిద్దిపేట: సిద్దిపేట నియోజకవర్గంలో ఇటీవల కురిసిన వడగళ్ల వానతో పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని మాజీ మంత్రి, ఎంఎల్ఎ తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఆదివారం నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ఆయన పర్యటించి నష్టపోయిన పంటలను పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ… రైతులు పంటలు నష్టపోయామని అధైర్యపడవద్దని మీకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుబంధు, బీమా లాంటి పథకాలను ప్రవేశపెట్టి రైతుల్లో భరోసా నింపింది సిఎం కెసిఆరే అని మరోసారి తెలియజేశారు.

ప్రకృతి వైపరిత్యం కారణంగా అకాల వర్షాలు, వడగళ్ల వాన పడడంతో వరితో పాటు మామిడి, వివిధ తోటలు తీవ్రంగా దెబ్బతిని నష్టం వాటిల్లడం ఎంతో బాధకరమన్నారు. నష్టపోయిన పంటల, తోటలపై పూర్తి స్థాయి నివేదికను రూపొందించాలని వ్యవసాయ, ఉద్యానవన, రెవెన్యూ శాఖల అధికారులను ఆదేశించారు. నివేధిక రాగానే సిఎం కెసిఆర్ దృష్టికి తీసుకెళ్లి నష్టపోయిన పంటలకు పరిహారం ప్రభుత్వపరంగా అందిస్తామన్నారు. బీమా కలిగి ఉన్న వారికి ఆ కంపెనీ వారు సహయం అందిస్తారని తెలిపారు. ఈ కార్యాక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు కూర మాణిక్యరెడ్డి, నమూండ్ల రామచంద్రం, కనకయ్య, బాల్‌రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్పొన్నారు.

Harish Rao poised to farmers for damaged crops