Home తాజా వార్తలు పరీక్షల్లో ఫెయిలైతే జీవితంలో ఓడినట్టు కాదు: హరీష్

పరీక్షల్లో ఫెయిలైతే జీవితంలో ఓడినట్టు కాదు: హరీష్

harish raoహైదరాబాద్: ఇంటర్మీడియట్ లో ఫెయిలైనంత మాత్రాన జీవితంలో ఓడిపోయినట్టు కాదని, ప్రాణాలు తీసుకోవద్దని టిఆర్ఎస్ సిద్దిపేట ఎంఎల్ఎ హరీశ్ రావు సూచించారు. కొన్ని రోజులుగా పరీక్షల్లో ఫెయిలైన పిల్లలు ఆత్మ హత్యలు చేసుకోవడం చూస్తే గుండె తరుక్కుపోతోందన్నారు. పరీక్షల్లో ఫెయిలైతే జీవితంలో ఓడినట్లు కాదు. ప్రాణాలు పోతే తిరిగిరావు. దయచేసి ప్రాణాలు తీసుకోవద్దని కోరారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు.

ఇంట్లో పిల్లలను ఒత్తిడికి గురిచేసే పనులు చేయకూడదని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు కొన్ని సూచనలు, సలహాలు ఇచ్చారు. కంటి పాపలైన మన బిడ్డల్ని కాపాడుకుందామని తెలిపారు. ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో ఫెయిలైన విద్యార్థులు మనస్థాపం చెంది బలవన్మరణాలకు పాల్పడుతున్న సంగతి తెలిసిందే.

 

 

Harish Rao responded to student suicides