Search
Friday 20 July 2018
  • :
  • :
Latest News

సమగ్రాభివృద్ధే ఎజెండా

Harish Rao Speech About Devlopment In Sangareddy Dist

మెదక్ జిల్లాలో అన్నిరంగాల్లో అభివృద్ధి ప థంలో నడిపించడానికి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని రాష్ట్ర నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం సంగారెడ్డిలోని జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం జరిగింది. జడ్‌పి చైర్‌పర్సన్ రాజమణీ మురళీయాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి మా ట్లాడుతూ అభివృద్ధి, ప్రజా సంక్షేమం తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి వేరే ఎజెండా లేదని అన్నా రు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి అనేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గతంలో కరెంటు ఎప్పు డు ఉంటుందో… ఎప్పుడు పోతుందో… తెలియని పరిస్థితి ఉండేదని తెలిపారు. తెలంగాణ వస్తే చీకటేనని గత పాలకులు దుష్ప్రచారం చేశారన్నారు. కానీ సిఎం కెసిఆర్ ఆధ్వర్యంలో నిరంతర విద్యుత్ సరఫరా విజయవంతంగా జరుగుతుందని తెలిపారు. గృహావసరాలకే కాకుండా వ్యవసాయానికి కూడా విద్యుత్ లోటు లేకుండా చేసిన ఘనత సీఎందే అని అన్నారు. విపక్షాలకు రాజకీయ లబ్ధిపొందాలన్న ఆలోచన తప్ప ప్రజా సంక్షేమం పట్టడం లేదని పేర్కొన్నారు. మిషన్‌కాకతీయ, మిషన్‌భగీరథ, రైతుబంధు, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ తదితర గొప్ప పథకాలను ఇతర రాష్ట్రాలే మెచ్చుకుంటుంటే ఇక్కడి విపక్షాలకు మాత్రం పాలుపోవడం లేదన్నారు. ఏనాడైనా కాంగ్రెస్ నాయకులు ప్రభుత్వం మంచి పథకాలను మెచ్చుకున్నారా అని మంత్రి ప్రశ్నించారు. సభ్యుల కోరిక మేరకు మొత్తం జడ్‌పిటిసిలకు ఒక్కొక్కరికి రూ.10లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. వచ్చే సమావేశంలో ఎంపీపీలు కూడా మంజూరి చేస్తామన్నారు. గ్రామాల్లో తక్షణమే తాగునీటి సమస్యను పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే చింతాప్రభాకర్, ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు ఫరిదుద్దిన్, రాములునాయక్,  ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, డిసిసిబి చైర్మన్ దేవేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, కలెక్టర్లు వెంకటేశ్వర్లు, ధర్మారెడ్డి, జడ్‌పి సీఈవో రవి పాల్గొన్నారు.

Comments

comments