Home సిద్దిపేట అర్హులందరికీ డబుల్ ఇండ్లు

అర్హులందరికీ డబుల్ ఇండ్లు

Harish rao Speech About Double BedRoom Homes

అవినీతికి  తావివ్వకుండా అర్హులైన నిరుపేదలకు డబు ల్ బెడ్‌రూం ఇండ్లు కేటాయించడం జరుగుతుందని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని సమీకృ త కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పట్టణానికి చెందిన నిరుపేదలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న సొంతింటి కళను త్వరలోనే నెరవేర్చబోతున్నామన్నారు. డబుల్ బెడ్‌రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక పూర్తి బాధ్యతను జిల్లా కలెక్టర్ వెంకట్రామారెడ్డికే అప్పగించడం జరిగిందన్నారు.  సిద్దిపేట పట్టణంలో 1960 డబుల్ బెడ్ రూం ఇండ్లు పూర్తయ్యాయని, ఈ నెల 9 నుంచి 12 వరకు పట్టణంలోని 34 వార్డులలో డబుల్ బెడ్ రూం ఇండ్ల కోసం దరఖాస్తుల స్వీకరణ చేపడుతున్నట్లు వివరించారు. ఈ దరఖాస్తు ఫారాన్ని సైతం  ప్రభుత్వం తరపునే అందించడం జరుగుతుందని, ఈ ఫారమ్‌లో దరఖాస్తు దారులు పూర్తి వివరాలు పొందుపరిచి అధికారులకు అందజేయాలన్నారు. ప్రతి ఐదు వార్డులకు ఒక జిల్లా అధికారిని నియమిస్తున్నట్లు వివరించారు. అదే విధంగా ఈ నెల 16వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు దరఖాస్తులను పరిశీలించి ఆగస్టు 2వ వారంలో ఎంపిక చేసిన లబ్ధిదారుల వివరాలను అన్ని వారుడల్లో గోడలకు అతికించడం జరుగుతుందన్నారు. ప్రజలకు అనుమానాలుంటే అధికారులకు తెలియజేయాలన్నారు. దరఖాస్తులు చే సుకున్న వారికి అక్కడకక్కడే అధికారులు రశీదును అందిస్తారన్నారు. ఆగ స్టు చివరి వారంలో ఇండ్లను అప్పగించేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. డబుల్ బెడ్‌రూం ఇండ్ల అర్హుల ఎంపిక కోసం పారదర్శకంగా  చర్యలు చేపడుతున్నట్లు వివరించారు. అర్హులు కాని వారు దరఖాస్తు చేసుకుంటే చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో అధికారులు కూడా తప్పుడు నివేదికలు సమర్పిస్తే చర్యలు తప్పవన్నారు.  ప్రజ లు ఎలాంటి ప్రచారాలు నమ్మొద్దని, తెల్లకాగితంపై కాకుండా అధికారులు ఇచ్చే ఫారంతోనే పట్టణంలో ఏర్పాటు చేసిన కౌంటర్లలో నిర్ణయించిన గడు వు లోపు దరఖాస్తులను నేరుగా చేసుకోవాలన్నారు. దేశంలోనే సీఎం కేసీఆర్ రోల్ మాడల్‌గా నిలిచి ఇండ్లు లేని నిరుపేదలకు ఇండ్లు కట్టించాలనే ఉద్దేశ్యంతో గేటెడ్ కమ్యూనిటీని తలపించేలా ఇండ్లు నిర్మించారన్నారు.  నిజమైన పేదలకు డబుల్‌బెడ్‌రూం  ఇండ్లు రావాలన్నదే తమ ముఖ్య లక్షమన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, వికలాంగుల కోటాలో పేదలకు ఇండ్లు అందించడం జరుగుతుందన్నారు. డబుల్ బెడ్ రూంలలో ఎక్కువ మంది లబ్ధిదారులు దరఖాస్తు చేసుకుంటే లాటరీ పద్ధతి ద్వారా ఇండ్లను అప్పగించడం జరుగుతుందన్నారు. సిద్దిపేట డబుల్‌బెడ్‌రూం ఇండ్ల కాలనీలో అన్ని సౌకర్యాలు, సకల హంగులు సమకూర్చుతున్నట్లు వివరించా రు. లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవొద్దన్నారు. రూపాయి లంచం లేకుండా అర్హులైన వారికీ ఇండ్లను అందించడ మే లక్షంగా పెట్టుకున్నామని, ఒక వేళ లంచం ఇచ్చినా, తీసుకున్న వారి పై కేసులు నమోదు చేస్తామన్నారు. అలాగే జిల్లాలోని సిద్దిపేట,గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్‌తోపాటు తదితర ప్రాంతాల్లో నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇండ్లు త్వరితగతిన పూర్తి చేసి అర్హులకు అందించడం జరుగుతుందన్నారు. ఇండ్లు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తిరిగి అవకాశం వచ్చినపుడు కేటాయిస్తామన్నారు. ఈ ప్రక్రియను ఆగస్టు చివరి మాసంలో పూర్తి చేసి పేదింటి స్వంతింటి కళను సాకారం చేస్తామన్నారు. గతంలో ప్రభుత్వం పక్షాన ఇండ్లు, స్థలాలు లబ్ధిపొందిన వారికి చోటు లేదన్నారు. జిల్లా కలెక్టర్ వెంకట్రామారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న డబుల్‌బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా పకడ్బంధీగా విచారణ చేపట్టి అర్హులైన వారికి ఇండ్లలో చోటు కల్పిస్తామన్నారు.  ప్రజలు ఎలాంటి అనుమనాలకు లోను కావొద్దని, అధికారులే స్వయంగా తమతమ వార్డులకు వచ్చి దరఖాస్తులను స్వీకరిస్తారన్నారు. సమావేశంలో దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి, జాయింట్ కలెక్టర్ పద్మాకర్, విద్యుత్ ఎస్‌ఈ కర్ణాకర్ బాబు, డీఆర్‌ఓ చంద్రశేఖర్,  ప్రజాప్రతినిధులు కడవేర్గు రాజనర్సు, మారెడ్డి రవీందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పూజల వెంకటేశ్వర్‌రావు, పాల సాయిరాంతో పాటు వివిధ శాఖల అధికారులు, నాయకులు ఉన్నారు.