Search
Thursday 22 November 2018
  • :
  • :
Latest News

కాళేశ్వరం ప్రాజెక్టు నీరు మొదటగా రాఘవాపూర్‌కు అందిస్తాం: హరీష్‌రావు

Harish Rao Speech About Kaleshwaram Project In Siddipet

మనతెలంగాణ / సిద్దిపేట రూరల్ ః కాళేశ్వరం నీరు మెట్టమొదటగా రాఘవాపూర్ గ్రామానికి రైతులకు అందిస్తామని మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట మండలంలోని రాఘవాపూర్ గ్రామంలో పలు అభివృద్ది కార్యక్రమాలలో పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ కాలానికి ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా కాల్వ కాళేశ్వరం నీటి ద్వారా రాఘవాపూర్, ప్రాంతాలలో ఉన్న చెరువులను , కుంటను నింపనున్నట్లు తెలిపారు. అదే విధంగా గ్రామానికి 4690 ఎకరాల సాగు భూమికి నీరు అందుతుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సిఎం కెసిఆర్ రైతుల కోసం ఎన్నో అనేక పథకాలు అమలు చేశాడన్నారు. గతంలో ఎన్నో ప్రభుత్వాలు మారిన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కాలేదన్నారు. తెలంగాణ ఏర్పాటు అయిన తరువాత కాళేశ్వరం నాలుగు సంవత్సరాలలో కాళేశ్వరం ప్రాజెక్టు రైతులకు పూర్తి చేసి నీరు అందుతుంది. రాఘవాపూర్ గ్రామంలో గ్రామపంచాయతీ, స్మశాన వాటిక, ముదిరాజ్ సంఘ భవన, మహిళా సాముహిక భవనాలను ప్రారంభించారు. అనంతరం రాఘవాపూర్ మధిర గ్రామమైన ఇందిరగూడం వద్ద మహిళా సాముహిక భవనం ఆవరణలో మంత్రి హరీష్‌రావు మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సత్తయ్యగౌడ్, సుడా చైర్మన్ మారెడ్డి రవిందర్‌రెడ్డి, ఎంపీపీ ఎర్ర యాదయ్య, జడ్పీటీసీ గ్యార వజ్రమ్మ యాదగరి, తుపాకుల బాల్‌రంగం, పీఎసీఎస్ చైర్మన్ నల్ల రవీందర్ రెడ్డి , ఎంపీటీసీ బరిగల నర్సింలు, శ్రీనివాసరావు, ఎంపీడీవో సమ్మిరెడ్డి , ఎల్లం తదితరులు పాల్గొన్నారు.

Comments

comments