Home తాజా వార్తలు టిఆర్ఎస్ ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి

టిఆర్ఎస్ ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి

Harish Rao

గజ్వేల్‌: గజ్వేల్‌ ప్రజల పట్టుదల, వారి ముఖాల్లో చిరునవ్వు చూస్తుంటే భారీ మెజార్టీతో సిఎం కెసిఆర్‌ గెలుపు ఖాయమనిపి స్తోందని మంత్రి హరీశ్ రావు ఆశాభావం వ్యక్తంచేశారు. సోమవారం గజ్వేల్‌లో ఎన్నికల ప్రచారంలో భాగంగా హరీశ్‌రావు మాట్లాడుతూ… మహాకూటమిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అభివృద్ధికి పట్టం కడతారో, అవినీతికి పట్టం కడతారో ప్రజలే తేల్చుకోవాలని హరీశ్ పిలుపునిచ్చారు. టిఆర్ఎస్ ప్రభుత్వంతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు.

త్వరలోనే గజ్వేల్‌కు కాళేశ్వరం నీళ్లు ఇస్తామని హామి ఇచ్చారు. నాలుగేళ్లలో జరిగిన అభివృద్ధిని ప్రజలంతా గమనించాలని, గజ్వేల్‌ మార్కెట్ అద్భుతంగా అభివృద్ధి చేసింది కెసిఆర్ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. గత నాలుగున్నరేళ్లలోనే టిఆర్ఎస్ ప్రభుత్వం ఎంత అభివృద్ధి చేసిందనే విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. రాష్ట్రంలో పేదింటి ఆడ బిడ్డలకు కల్యాణలక్ష్మి పథకంతోపాటు, గర్భవతులకు ఉచిత కాన్పు చేసి కెసిఆర్‌ కిట్లు కూడా అందజేస్తున్నామన్నారు. కానీ, గత కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలను గాలికి వదిలేశారని, కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదని.. ఇప్పుడు ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని హరీశ్ రావు విమర్శించారు.

Harish rao speech at election campaign in Gajwel