Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

పారిశ్రామిక హాబ్‌గా సిద్దిపేట

Harish Rao Try To make Siddipet an industrial hub

సిద్దిపేటను పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దడానికి అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు తెలిపారు. హైదరాబాద్‌లోని ఆయన స్వగృహంలో సోమవారం రాత్రి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ వెంకట్రామారెడ్డి, టీఎస్‌ఐఐసీ ఎండీ ఈవీ నర్సింహ్మరెడ్డిలతో ఇండ్రస్టీయల్ పార్కుపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిద్దిపేట నియోజకవర్గంలో 500 ఎకరాలలో ఇండ్రస్టీయ ల్ పార్కును ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటికే 300 ఎకరాల భూసేకరణ చేపట్టడం జరిగిందని, మిగతా భూమిని త్వరితగతిన భూ సేకరణను పూర్తి  చేయాలని అధికారులను ఆదేశించారు. మొదటి పరిశ్రమ ను  46 ఎకరాలలో రూ.200 కోట్ల వ్యయంతో డీఎక్స్‌ఎన్ కంపెనీ నిర్మిస్తుందన్నారు. అవసరమైన భూమిని సేకరించి టీఎస్‌ఐఐసికి అప్పగించాలని కలెక్టర్ వెంకట్రామారెడ్డికి ఆదేశించారు. మౌళిక సదుపాయాలు ఉన్నచోటనే పరిశ్రమలు ఏర్పాటు అవుతాయన్నారు.

Comments

comments