Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

మిడ్ మానేరుపై హరీశ్‌రావ్ సమీక్ష

harish-rao-vedio-confrence

హైదరాబాద్: సచివాలయంలో మిడ్ మానేరు ప్రాజెక్ట్ పనులపై నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావ్ అధికారులతో గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ లో ఇఎన్ సి హరిరావ్, ఒఎస్డి శ్రీధర్ దేశ్ పాండే, రాజన్నసిరిసిల్లకు చెందిన పలువురు ఇంజినీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ మాట్లాడారు. గత సంవత్సరం మిడ్ మానేరు నుంచి 5 టిఎంసిల నీటిని అందించామని గుర్తు చేశారు. ఈ ఏడాది 25 టిఎంసిల నీటిని అందించే అవకాశం మెండుగా ఉందన్నారు.

ఈ ప్రాజెక్ట్ కింద ప్రత్యేకంగా 76వేల ఎకరాల భూమికి నీటిని అందిస్తామని స్పష్టం చేశారు. గేట్లన్నింటిని ఆపరేషనలైజ్ చేసి సిద్దంగా ఉంచాలని అధికారలకు సూచించారు. ఈ క్రమంలో మంత్రి ప్లడ్ కంట్రోల్ రూం పనుల ఎలా జరుగుతున్నాయని వారిని అడిగి తెలుసుకున్నారు. లింక్ కెనాల్ పనులను తొందరగా పూర్తి చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు. మిడ్ మానేరు ద్వారా ఎన్ని చెరువుల్లో నీరు నింపొచ్చో ఆ వివరాలను తమకు పంపాలని సంబంధిత అధికారులకు హరీశ్ ఆదేశించారు. మిడ్ మానేరు పునరావాస చర్యల కోసం రూ. 33 కోట్లకు ఆథరైజేషన్ పెండింగ్ లో ఉందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకోచ్చారు. దీంతో తక్షణమే మంత్రి హరీశ్ రావు ఆర్థికశాఖ అధికారులతో చర్చలు జరిపి ఆథరైజేషన్ ప్రక్రియను పూర్తి చేయించారు.

Comments

comments