Search
Monday 16 July 2018
  • :
  • :
Latest News

కాళేశ్వరం పనులను పరిశీలించిన మంత్రి హరీశ్‌

harish-rao

కరీంనగర్: కాళేశ్వరం ప్రాజెక్ట్ పనులను నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్ రావు గురువారం పరిశీలించారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణంలో భాగంగా ప్యాకేజీ 8 నుంచి కాలువ దాకా బయలుదేరే గ్రావిటీ కాలువ లైనింగ్ పనులకు సంబంధించిన అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో కురుస్తున్న వర్షాల కారణంగా లైనింగ్ పనులను ఆపామని ఇంజనీర్లు మంత్రికి తెలియజేశారు. కాలువలో వీటిని తోడి పనులు చేస్తున్నామని వారు పేర్కొన్నారు. కాలువ మీద స్త్రక్చర్లు జూలై చివర వరకు పూర్తి అవుతాయని తెలిపారు. వరద కాలువ లో కలిసే ముందు ఉన్న రెగ్యులేటర్ గేట్ల బిగింపు పనులు ఆగస్ట్ నెలలో పూర్తి చేస్తామని చెప్పారు. ప్రాజెక్ట్ పనులు మరింత వేగవంతం చేయాలని మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు.

Comments

comments