Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

మహిళ విద్యకే కెసిఆర్‌ అధిక ప్రాధాన్యత…

Minister Harish rao Visits Double Bedroom Houses At Siddipet

సిద్దిపేట: చిన్నకోడూరు మండలం పెద్దకోడూరులో మంత్రి హరీశ్‌ రావు బుధవారం పర్యటించారు. ఈసందర్భంగా మహిళా పాలిటెక్నిక్‌ కాలేజీ వసతిగృహాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సివిల్‌, ఎలక్ట్రికల్‌ కోర్సులకు మంచి ఆదరణ ఉందని చెప్పారు. ప్రభుత్వ ప్రాజెక్టుల్లో సివిల్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీర్లకు మంచి అవకాశాలు లభిస్తున్నాయని తెలియజేశారు. మౌలిక వసతుల్లో ఇప్పుడిప్పుడే భారతదేశం ముందుకు పోతుందని ఆయన పేర్కొన్నారు. మహిళా విద్యకు సిఎం కెసిఆర్‌ అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు హరీశ్‌ తెలిపారు. కస్తూర్బా గాంధీ పాఠశాలలను ఇంటర్‌ దాకా అప్‌గ్రేడ్‌ చేశామని చెప్పారు. డిగ్రీ వరకు అప్‌గ్రేడ్‌ చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. ప్రభుత్వ విద్యాలయాల్లో కార్పొరేట్‌ స్థాయి విద్య అందించాలనేదే తమ ప్రభుత్వ లక్ష్యామని మంత్రి హరీశ్ పేర్కొన్నారు.

Comments

comments