Home తాజా వార్తలు రేపు కోమటి చెరువుపై ‘జిప్ సైక్లింగ్’ ప్రారంభించనున్న హరీష్ రావు

రేపు కోమటి చెరువుపై ‘జిప్ సైక్లింగ్’ ప్రారంభించనున్న హరీష్ రావు

ZIP-Cycling
సిద్దిపేట : జిల్లా కేంద్రంలోని కోమటి చెరువు పర్యాటక క్షేత్రంగా పేరుగాంచింది. మాజీ మంత్రి, ఎంఎల్ఏ తన్నీరు హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో కోమటిచెరువు మినీ ట్యాంక్ బండ్ ఇప్పటికే అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. గతంలో సిద్దిపేట వాసులు పర్యటక క్షేత్రాలకు వెళ్లాలంటే కరీంనగర్, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్లేవారు. కానీ మినీట్యాంక్ బండ్ వద్ద ఆహ్లదకరమైన పార్కుతో పాటు చిన్నారులకు ఆడుకునేందుకు అడ్వెంచర్ గేమ్స్, కళాక్షేత్రం, బోటింగ్ లాంటి అనేక అనేక సౌకర్యాలు ఏర్పాటు చేయడంతో సిద్దిపేట ప్రాంత ప్రజలు ఇక్కడే తమ సమయాన్ని గడిపేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు మినీ ట్యాంక్‌ను సాయంత్రం వేళలో వచ్చి సేద తీరుతున్నారు. ఇక్కడి వచ్చే వారికై సైతం ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా టాయిలెట్స్, మంచినీటి లాంటి సదుపాయాలను ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్‌పై ఏర్పాటు చేసిన లవ్ సిద్దిపేట సింబల్ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
రేపు ప్రారంభం కానున్న జిప్ సైక్లింగ్ …
సిద్దిపేట కోమటి చెరువు మినీ ట్యాంకుబండ్‌పై ఏర్పాటు చేసిన జిప్ సైక్లింగ్ నేడు ప్రారంభం కానుంది. దీన్ని రేపు మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ప్రారంభించనున్నారు. హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా సిద్దిపేటలో ఈ జిప్ సైక్లింగ్ ప్రారంభం కానుంది. జిప్ సైక్లింగ్ ఏర్పాటు కావడంతో సిద్దిపేట ప్రాంత ప్రజలు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Harish Rao will launch Zip cycling on tomorrow