Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

మొక్కలు నాటడం అందరి బాధ్యత

Untitled-1సిద్దిపేట అర్బన్ : పసి పిల్లల్ని పోషించడం లో ప్రతి ఒక్కరు ఎంత జాగ్రత్త వహిస్తారో… మనం నాటిన ప్రతి మొక్కను సైతం అంతే జాగ్రత్తగా పెంచి పోషించాలని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు పేర్కొన్నారు. హరిత హారం కార్యక్ర మంలో భాగంగా ఆదివారం ఆయన పట్టణంలోని చర్చి కాంపౌండ్, నాసర్‌పురా, నర్సాపూర్ రోడ్డులోని ఎస్‌ఎ స్‌ఆర్ వే బ్రిడ్జి వద్ద మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సిద్దిపేట పట్టణాన్ని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దడానికి ప్రతి ఒక్కరూ తమ విధిగా సహాయ సహకారాలు అందించాల న్నారు. మొక్కలు నాటడం అందరి సమష్టి బాధ్యత అని, మన ఊరు పచ్చగా ఉంటెనే అందరు ఆహ్లాదంగా, ఆరోగ్యంగా ఉంటార ని అన్నారు. మొక్కలు నాటడం ఎంత ము ఖ్యమో వాటిని కాపాడటం కూడా అంతే ముఖ్యమన్నారు. సర్కారు మనకు ఏమి చేసిందో ఆలోచించడంతో పాటు సమాజా నికి మనం ఏమి చేశామన్నది ఒక్కసారి ఆలోచించాలని అన్నారు. పట్టణం అంత టా మెక్కలను నాటి పట్టణాన్ని గ్రీన్ సిటీగా మార్చి రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాలని పిలు పునిచ్చారు. క్రిస్టియన్, మైనార్టీల ఆడ పిల్లల పెళ్లిల కోసం ప్రభుత్వం షాదీ ముబారక్‌ను అమ లు చేస్తుందన్నారు. ఆడ పిల్ల పెళ్లికి ముందే సర్కారు రూ.51 వేలు అందిస్తుందని తెలిపారు. ముస్లిం మైనార్టీల తో పాటు క్రిస్టియన్ మైనార్టీలు షాదీ ముబా రక్ పథకాన్ని సద్వినియోగపరచుకోవా లన్నారు. క్రిస్టియన్ మైనార్టీలకు షాదీ ము బారక్‌పై అవగాహన కల్సిచాలన్నారు. పట్ట ణంలోని చర్చి అభివృధ్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ఆర్డీ ఒ ముత్యం రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాసులు, ఓఎస్‌డి బాల్‌రాజ్, టిఆర్‌ఎస్ నాయకులు రాజనర్సు, నయ్యర్ పటేల్, చిన్నా, సాయి రాం, వెంకట్‌గౌడ్, మల్లికార్జన్, శ్రీకాంత్ గౌడ్, నగేశ్, రాములు, చర్చి పాస్టర్ అశోక్, చర్చి సభ్యలు బి.ప్రపాద్, అనిల్, అశోక్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments