Search
Wednesday 26 September 2018
  • :
  • :
Latest News

వధూవరులను ఆశీర్వదించిన మంత్రి హరీశ్

harish

మన తెలంగాణ/సిద్దిపేట అర్బన్ : సిద్దిపేట పట్టణంలోని గురువారం జరిగిన పలు వివాహాలకు మంత్రి హరీశ్‌రావు, ఎంపి కె.ప్రభారరెడ్డిలు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. రెడ్డి సంక్షేమ భవన్‌లో జరిగిన గంగాపూర్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ మూర్తి బాల్‌రెడ్డి కూతురు వివాహానికి, పద్మనాయక కళ్యాణమండపంలో జరిగిన కౌన్సిలర్ కంటెం రాజు కూతురు వివాహానికి, టిఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు డాల్ఫిన్ మురళి కుమారుని వివాహానికి, మిలాన్ గార్డెన్‌లో జరిగిన రాగుల చంద్రం కూతురు వివాహానికి, కొండ మల్లయ్య గార్డెన్, కొండ భూదేవి గార్డెన్, పటేల్ గార్డెన్, సిసి గార్డెన్, భైరి అంజయ్య ఫంక్షన్ హాల్, విఎఆర్ గార్డెన్, మోకిడి నరసింహ్మారెడి గార్డెన్‌లో జరిగిన వివాహాలకు, లింగారెడ్డిపల్లి సర్పంచ్ రామస్వామి కూతురు వివాహానికి మంత్రి హరీశ్‌రావు హాజరైనారు.

Comments

comments