Home తాజా వార్తలు నిమ్మ మార్కెట్ కల నిజమైంది: హరీశ్ రావు

నిమ్మ మార్కెట్ కల నిజమైంది: హరీశ్ రావు

Harishrao Ingrated the lemon market in Nalgonda district

నల్లగొండ: నల్లగొండ జిల్లాలో నిమ్మ, బత్తాయి మార్కెట్ ఏర్పాటు ఓ కల అని, ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీస్సులతో నకిరేకల్ లో నేడు ఆ కల నిజమైందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. నకిరేకల్ లో ఏర్పాటు చేసిన నిమ్మ మార్కెట్ రాష్ట్రంలో తొలి మార్కెట్. నిమ్మ మార్కెట్, ప్రాధమిక వ్యవసాయ భవనం గోదామును మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ..నిమ్మ మార్కెట్ రాక ముందు రైతులు ‌ఇక్కడ చాలా ఇబ్బందులు పడ్డారని గర్తు చేశారు. నకిరేకల్ లో కోల్డ్‌స్టోరేజీ కావాలని ఎంఎల్ఏ వీరేశం కోరాగా మంజూరు చేస్తామని  హరీశ్ రావు హామీ ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు తొలి ఫలితం‌ అందుకునేది పాత వరంగల్ జిల్లా, సూర్యాపేట జిల్లానే అని ఆయన అన్నారు. కాంగ్రెస్ అంటేనే కరెంట్ కోత, విత్తనాలు,‌ ఎరువుల కొరత అని ఎద్దేవా చేశారు. నీటి నిర్వహణ లో తెలంగాణ చక్కటి ప్రతిభ కనబరుస్తోందని కేంద్రం కితాబిచ్చిందని హరీశ్ రావు తెలిపారు.