Home తాజా వార్తలు మహిళల టి20 ప్రపంచకప్: సెంచరీ బాదిన హర్మన్‌

మహిళల టి20 ప్రపంచకప్: సెంచరీ బాదిన హర్మన్‌

Harmanpreet Kaur becomes first Indian to slam a century

గయానా: కరీబియన్ దీవుల్లో మహిళల టి20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌వుమన్ హర్మన్‌ప్రీత్ కౌర్(103: 51 బంతుల్లో 7ఫోర్లు, 8సిక్సర్లు) సెంచరీతో చెలరేగింది. టి20 కెరీర్‌లో తనకిదే తొలి శతకం కావడం వేశేషం. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఓవర్‌లోనే భారత్ 9 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ప్రత్యర్థి బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 5.4 ఓవర్లకు 40/3తో భారత్ కష్టాల్లో పడింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన హర్మన్ ధనాధన్ బ్యాటింగ్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ఆమెకు తోడుగా క్రీజులో ఉన్న జెమీమా రోడ్రిగ్స్ అర్ధశతకంతో సత్తాచాటింది. వీరిద్దరూ రెచ్చిపోయి బ్యాటింగ్ చేయడంతో జట్టుకు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. వీరిద్దరూ మొత్తం 134 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లలో కట్టడి చేసిన కివీస్ బౌలర్లు మధ్య ఓవర్లలో తేలిపోయారు. ఆఖరి ఓవర్ వరకు హర్మన్ చితక్కొట్టడంతో 20 ఓవర్లలో భారత్ 5 వికెట్లకు 194 పరుగులు చేసింది.

Harmanpreet Kaur becomes first Indian to slam a century

Telangana News