Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

హ‌ర్మ‌న్‌ప్రీత్ కు ఎదురుదెబ్బ!

Harmanpreet Kaur’s DSP rank withdrawn over fake degree row

చండీగఢ్: టీమిండియా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కు ఎదురుదెబ్బ తగిలింది. హ‌ర్మ‌న్‌ప్రీత్ త‌న డిఎస్పీ ర్యాంక్‌ను కోల్పోయింది. ఆమె సమర్పించిన డిగ్రీ పట్టా నకిలీదని తేలడంతో పంజాబ్ సర్కార్ ఈ నిర్ణ‌యం తీసుకుందని సమాచారం. 12వ తరగతి పూర్తి చేసిన హర్మన్ ప్రీత్ కు కేవలం కానిస్టేబుల్ ఉద్యోగం మాత్రమే వస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అయితే ఇదే డిగ్రీ పట్టా ఆధారంగా గతంలో ఇండియన్ రైల్వేస్ లో ఉద్యోగం చేసిన హర్మన్ ఇప్పటి వరకు ఈ అంశంపై స్పందించలేదు. హర్మన్ ప్రీత్ నకిలీ సర్టిఫికెట్ వివరాలను ఇటీవలే పోలీసు శాఖ సిఎంఒకు అందజేసింది. డిఎస్పీ ఉద్యోగానికి సరిపడా విద్యార్హతలు ఆమెకు లేవని తన నివేదికలో పేర్కొంది. దీంతో డిఎస్పీగా కొనసాగేందుకు కుదరదని సిఎంకు పోలీస్ శాఖ ప్రతిపాదించింది. ఈ నేపథ్యంలోనే హర్మన్ ప్రీత్ తన డిఎస్పీ ఉద్యోగం కోల్పోనుంది.

Comments

comments