Home తాజా వార్తలు పేరుకు గాయని.. చేసింది కేడీ పని!

పేరుకు గాయని.. చేసింది కేడీ పని!

Stage Singer Shikha Raghavన్యూఢిల్లీ: కొత్త నోట్లు ఇప్పిస్తానంటూ రూ. 60 లక్షల రద్దయిన నోట్లతో ఉడాయించిన ఒక మాయలేడిని పోలీసులు అరెస్టు చేశారు. హర్యానాకు చెందిన 27 ఏళ్ల శిఖా రాఘవ్ అనే గాయని 2016లో పెద్ద నోట్లు రద్దయిన తర్వాత తనకు తెలిసిన ఒక రిటైర్డ్ మిలిటరీ అధికారిని పాత నోట్ల స్థానంలో కొత్త నోట్లు ఇప్పిస్తానని నమ్మించి ఆ డబ్బుతో పరారైంది. ఢిల్లీ, ఇతర ప్రాంతాలలో జరిగే స్టేజ్ షోలు, మతపరమైన కార్యక్రమాలలో శిఖా రాఘవ్ పాటలు పాడుతుంటుంది. తన మిత్రుడు పవన్‌తో కలసి ఉత్తర ఢిల్లీలోని రాంలీలలో 2016 చివరిలో ఒక కార్యక్రమంలో పాల్గొంది. ఆ కార్యక్రమ నిర్వాహకుడైన రిటైర్డ్ సైనికాధికారి తన దగ్గర పాత నోట్లు ఉన్నాయని చెప్పడంతో ఆమె, ఆమె స్నేహితుడు తాము వాటి స్థానంలో కొత్త నోట్లు మార్పిస్తామని నమ్మబలికారు. ఆ తర్వాత పాత నోట్లు తీసుకుని వీరిద్దరూ ఉడాయించారు. దీంతో ఆ మాజీ అధికారి రూప్‌నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పవన్‌ను తొందరగానే పట్టుకున్న పోలీసులకు శిఖా రాఘవ్ మాత్రం రెండేళ్ల నుంచి చిక్కలేదు. ఆమె హర్యానాలో ఉంటోందని సమాచారం లభించడంతో పోలీసులు అక్కడకు వెళ్లి ఆమెను అరెస్టు చేసి ఢిల్లీకి తీసుకువచ్చారు. కాగా, ఆమె నుంచి డబ్బు ఏదీ స్వాధీనం చేసుకోలేదని డిసిపి(నార్త్) నూపుర్ ప్రసాద్ తెలిపారు.

Haryana Singer arrested for eloping with Rs 60 Lakh old currency, Stage Singer Shikha Raghav was arrested by Delhi police