Search
Wednesday 19 September 2018
  • :
  • :
Latest News

కోహ్లి రికార్డుకు ఆమ్లా బ్రేక్

Hasim-Amla

లండన్: భారత కెప్టెన్ విరాట్ కోహ్లి రికార్డును సౌతాఫ్రికా స్టార్ హాషిం ఆమ్లా బద్దలు కొట్టా డు. వన్డే క్రికెట్‌లో అతితక్కువ ఇన్నింగ్స్‌లలో ఏడు వేల రికార్డులు పూర్తి చేసిన బ్యాట్స్ మన్‌గా కోహ్లి పేరిట ఉన్న రికార్డును ఆమ్లా సోమవారం తిరగరాశాడు. వన్డేల్లో కోహ్లి 161 ఇన్నింగ్స్‌లలో ఏడు వేల పరుగుల మైలురా యిని చేరుకుని అత్యంత వేగంగా ఇన్ని పరుగులు సాధించిన క్రికెటర్‌గా రికార్డు సృ ష్టించాడు. అయితే ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో వన్డే సందర్భంగా ఆమ్లా ఈ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. కేవలం 150 ఇన్నింగ్స్‌లలో ఏడు వేల పరుగుల మైలురా యిని చేరుకుని సరికొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో కోహ్లి సౌతాఫ్రికా స్టార్ డివిలియర్స్ పేరిట ఉన్న 166 ఇన్నింగ్స్‌లలో ఏడు వేల పరుగులు రికార్డును కోహ్లి బద్దలు కొట్టిన విషయం తెలిసిందే.
సౌతాఫ్రికాకు ఓదార్పు
ఇంగ్లాండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌ను ఇప్ప టికే కోల్పోయిన సౌతాఫ్రికాకు మూడో వన్డేలో ఓదార్పు విజయం దక్కింది. సోమవారం జరి గిన మూడో వన్డేలో సౌతాఫ్రికా ఏడు వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ఆధిపత్యం చెలాయించిన దక్షిణాఫ్రికా అలవోక విజయం అందుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 153 పరు గులకే కుప్పకూలింది. సౌతాఫ్రికా ఫాస్ట్ బౌల ర్లు రబడా, పార్నెల్ విధ్వంసక బౌలింగ్‌తో ఇంగ్లాండ్‌ను హడలెత్తించారు. రబడా నాలు గు, పార్నెల్ మూడు వికెట్లు తీశారు. మహారా జ్ కూడా మెరుగైన ప్రదర్శనతో మూడు వికెట్లు సొంతం చేసుకున్నాడు. ఒక దశలో 20 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి పీకల్లో తు కష్టాల్లో చిక్కుకున్న ఇంగ్లాండ్‌ను వికెట్ కీపర్ బైర్‌స్టో (51), విల్లే 37(నాటౌట్) ఆదు కున్నారు. దీంతో ఇంగ్లాండ్ ఈ మాత్రమైన స్కోరును సాధించింది. తర్వాత బరిలోకి దిగి న సౌతాఫ్రికా 28.5 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందు కుంది. ఆమ్లా (55), డికాక్ (౩4) జట్టును ఆదుకున్నారు.

Comments

comments