Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా జిఎస్‌టి చెల్లించవచ్చు

Hasmukh-Adhiaఇండోర్ : జిఎస్‌టి(వస్తు సేవల పన్ను) అమల్లోకి వచ్చిన తర్వాత వ్యక్తులు, సంస్థలు అన్‌లైన్ ద్వారా డెబిట్, క్రెడిట్ కార్డులతో పన్నులను చెల్లించవచ్చని రెవెన్యూ కార్యదర్శి హష్ముఖ్ అధియా తెలిపారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి కొత్త పరోక్ష పన్నుల విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికి గాను రిజిస్ట్రేషన్, రీఫండ్స్, రిటర్నుల దాఖలు అన్నీ ఆన్‌లైన్ ద్వారానే చేపట్టవచ్చని అధియా అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో ఇది పెను మార్పు తీసుకొస్తుందని అధియా పేర్కొన్నారు. జిఎస్‌టి అమలుతో దేశమంతా ఒకే మార్కెట్‌గా మారనుండగా, సంస్థలు, వ్యాపారులు ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్‌ను సులభంగా పొందొచ్చని ఆయన వివరించారు. నగదు చెల్లింపుల్ని నెఫ్ట్, ఆర్‌టిజిఎస్, డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా జరపవచ్చు,  అలాగే ఏ బ్యాంకు నుంచైనా కూడా చెల్లించే అవకాశం కల్పిస్తున్నారు. జమ్ము, ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఇదే పన్ను విధానం కొనసాగుతుందని, అయితే వారికి ప్రయోజనాలు మరో రూపంలో అందుతాయని పేర్కొన్నారు. జిఎస్‌టి కౌన్సిల్ ఇటీవల సమావేశమై కొన్ని నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశం వచ్చే నెలకు వాయిదా పడింది.

Comments

comments