Home అంతర్జాతీయ వార్తలు ఇరాన్ అధ్యక్ష పీఠంపై తిరిగి రౌహానీ

ఇరాన్ అధ్యక్ష పీఠంపై తిరిగి రౌహానీ

IRAN-ELECTION

టెహ్రాన్: ఇరాన్ అధ్యక్షుడిగా హసన్ రౌహానీ శనివారం నాడు ఘనంగా తిరిగి ఎన్నికయ్యారు. విదేశాలతో సంబంధాలను మెరుగుపరిచి, ఇబ్బందుల్లో ఉన్న ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడానికి ఆయన ప్రయత్నాలను ఓటర్లు బలపరిచారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని టెలివిజన్‌లో ఆంతరంగిక మంత్రి ఈ ఫలితాన్ని ధృవపరిచారు. రౌహా నీ మొత్తం 23.5 మిలియన్ ఓట్లు గెలుచుకొన్నారు. ఇది 57 శాతం. అతివాద ప్రత్యర్థి ఇబ్రహీం రైసీకి 38.3 శాతంతో మొత్తం 15.8 మిలియన్ ఓట్లు పోలయ్యాయి. శుక్రవారం జరిగిన అధ్యక్ష ఎన్నికలో మొత్తం 73 శాతం ఓటర్లు పాల్గొన్నారు. పోలింగ్ శాతం అధికంగా ఉండ డంతో అనేక గంటల పాటు పోలింగ్ వ్యవధిని అధికా రులు పొడిగించారు. ‘వివేకం, ఆశ మార్గంలో దేశ పయనాన్ని కొనసాగించడానికి ఓటర్లు నిర్ణయించ డాన్ని’ ఉపా ధ్యక్షుడు ఇషాక్ జహంగిరీ ప్రశంసించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 68 ఏళ్ల రౌహానీ ఇంతకు ముందు ఒక మితవాద పూజారి. ప్రపంచ ఆధిపత్య దేశాలతో చర్చించి 2015లో ఆయన అణు ఒప్పందాన్ని కుదుర్చు కొన్నారు. 6 దేశాలతో ఈ ఒప్పం దం కుదిర్చారు. ఇది ఆయన హయాంలో సాధించిన అత్యంత ఘన విజయం. అతివాది రైసీ 56 ఏళ్ల వ్యక్తి. తనను తాను పేదల సేవ కునిగా ప్రకటించుకొన్నారు. పశ్చిమ దేశాలతో మరింత కఠిన వైఖరి ఆయన లక్షం. తన విప్లవ ప్రసంగాలతో కార్మిక వర్గం ఓట్లను గెలుచు కోవడంలో ఆయన అంతగా సఫలం కాలేదు. రౌహానికి ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతా ల్లో ఆదరణ కనపడింది. తీవ్రవాద మార్పులు, బహుళ ఆర్థిక సంబంధాలపట్ల ఇరానీయన్లకు ఆపేక్ష లేదని ఈ ఎన్నిక ఫలితం స్పష్టం చేసింది. ఆర్థిక నిర్వహణ దీటుగా ఉంటేనే తమ దేశం అవస్థల నుంచి బయటపడుతుందని వారు మనస్ఫూర్తి గా నమ్ముతున్నా రని అలీవెజ్ అనే విశ్లే షకుడు అన్నా రు. ఇరాన్‌లో హింస, తీవ్రవాదాలకు ఇక తావులేదని కూడా ఆయన అన్నారు. అణు ఒప్పందం నుంచి వైదొల గుతానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరిస్తున్న నేపథ్యంలో రౌహానీ స్థిరత్వం ప్రదర్శిం చారు. ఆయన సంస్కరణల ఉద్యమం ద్వారా ఎదిగిన నాయకుడు. 2009లో ప్రజా నిరసనల తర్వాత ఆయన ఆ ఉద్యమా నికి స్వస్తిపలికారు. రౌహానీ ఇరాన్ విప్లవ కార్యాచర ణతో మూడు దశాబ్దాలపాటు సఖ్యంగా గడిపా రు. పశ్చిమ దేశాలకు దగ్గరవడానికి ప్రయత్నించి నట్లు అతివాద ప్రత్యర్థుల విమర్శలకు గురయ్యారు. 2013 లో సాధించిన తొలి విజయాన్ని తిరిగి సాధించి చూపారు.
మోడీ అభినందన :ఇరాన్ అధ్యక్ష పదవికి తిరిగి ఎన్ని కయిన రౌహానీని భారత ప్రధాని నరేంద్ర మోడీ శని వారం నాడు అభినందించారు. ఇరు దేశాల మధ్య గల ప్రత్యేక సంబంధాల మెరుగును ఆక్షాంక్షిస్తూ ఆయన ఇంగ్లీషు, పర్షియా భాషల్లో ట్వీట్ చేశారు.