Saturday, April 27, 2024

నగరంలో హవాలా దందా

- Advertisement -
- Advertisement -

Hawala Cash Seized in Hyderabad

హైదరాబాద్: నగరంలో హవాలా దందా జోరుగా సాగుతోంది. గత సాధారణ ఎన్నికల సమయంలో భారీగా పోలీసులు హవాలా డబ్బులు పట్టుకోగా మళ్లీ అదేస్థాయిలో పట్టుకున్నారు. మూడు రోజుల వ్యవధిలో రూ.1,12,95, 800 స్వాధీనం చేసుకున్నారు. డబ్బులను తరలిస్తున్న పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దుబ్బాక ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలకు చెందిన వారికి ఇచ్చేందు హవాలా డబ్బులను తరలిస్తున్నట్లు తెలిసింది. వాటికి సంబంధించిన ఎలాంటి పత్రాలు చూపించకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. నగరానికి బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన రాజస్థాన్, గుజరాజ్ తదితర రాష్ట్రాలకు చెందిన వారు నగరంలో హవాలా వ్యాపారం చేస్తున్నారు. హవాలా డబ్బులు కావాల్సిన వారికి 10శాతం కమీషన్ తీసుకుని కావాల్సిన వారికి ఇస్తున్నారు.

నల్లకుంటకు చెందిన అవినాష్ గౌడ్ హవాలా డబ్బులు రూ.50,00,000 తరలిస్తుండగా పోలీసులు ఎల్‌బి స్టేడియం వద్ద టాస్క్‌పోర్స్ పోలీసులు పట్టుకున్నారు. డబ్బులకు సంబంధించిన ఆధారాలు చూపించకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. ఎపిలోని చిత్త్రూరు జిల్లాకు చెందిన రమేష్ అనే వ్యక్తి నగరంలోని హవాలా వ్యాపారి ద్వారా డబ్బులు పంపించినట్లు తెలిసింది. అలాగే రాజస్థాన్‌కు చెందిన మనీష్ తోష్నివాల్ నగరంలోని హవాలా వ్యాపారం చేస్తున్నాడు. అతడికి సాయంగా విష్ణు పనిచేస్తున్నాడు. ఇద్దరు కలిసి హవాలా డబ్బులను మరో వ్యక్తికి ఇచ్చేందుకు బైక్‌పై వెళ్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వారి వద్ద ఉన్న రూ. 31,26,100ను స్వాధీనం చేసుకున్నారు. వీరు నగరంలోని ఓ వ్యక్తికి ఇచ్చేందుకు వెళ్తున్నట్లు తెలిసింది. అలాగే నారాయణగూడలో డాక్టర్ శ్రవణ్ రూ.16లక్షలు కారులో తరలిస్తుండగా పట్టుకున్నారు. గుజరాత్‌కు చెందిన నాయి లలిత్‌కుమార్ చునిలాల్, అశోక్ సింగ్, నారెడ్డి లక్ష్మికాంత్ రెడ్డి హవాలా డబ్బులు రూ.16,69,700 తరలిస్తుండగా టాస్క్‌పోర్స్ పోలీసులు పట్టుకున్నారు. వీరి వద్ద పట్టుకున్న డబ్బులకు ఎలాంటి ఆధారాలు చూపించలేకపోయారు. వీరు దుబ్బాక ఎన్నికల్లో పోటీ చేస్తున్న పార్టీల అభ్యర్థులకు ఇచ్చేందుకు తీసుకుని వెళ్తున్నట్లు తెలిసింది.

ఎన్నికల సమయంలోనే….

నగరంలో హవాలా డబ్బులు ఎక్కువగా ఎన్నికల సమయంలోనే పట్టుబడుతున్నాయి. నగరంలోని బేగంబజార్ కేంద్రంగా హవాలా వ్యాపారం ఎక్కువగా కొనసాగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి వారు హవాలా వ్యాపారం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు ఎక్కువగా డబ్బుల అవసరం రావడంతో హవాలా వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. గతంలో రాజకీయ పార్టీల నాయకులే డబ్బులు ఏర్పాటు చేసుకుని ఎన్నికల్లో పంచుకునేవారు. రాను రాను పోలీసుల నిఘా ఎక్కువ కావడంతో రాజకీయపార్టీల నాయకులు హవాలా ఏజెంట్లను ఆశ్రయిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News