Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

ప్రజల ప్రశాంత జీవనానికే హాక్‌ఐ ఆప్

నార్త్‌జోన్ ఐజిపి వై.నాగిరెడ్డి

Hawk-eye

సుల్తానాబాద్ : మహిళల పట్ల, ప్రజల పై నేరాలను అరికట్టేందుకు పోలీస్‌శాఖ డేగకన్నుతో నిఘాపెట్టి ప్రజలు ప్రశాంత జీవితం గడిపేందుకు ‘హాక్ ఐ’ అనే ఆప్‌ను ప్రజలు వినియోగించుకోవాలని నార్థ్‌జోన్ ఐజీపీ వై.నాగిరెడ్డి అన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ పరిధిలోని సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్‌లో హాక్‌ఐ అనే ఆప్‌ను నార్థ్‌జోన్ ఐజీపీ వై.నాగిరెడ్డి  మంగళవారం ప్రారంభించారు. అలాగే సుల్తానాబాద్ మండల కేంద్రంలో పోలీస్‌శాఖ అధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలను ఐజీపీ నాగిరెడ్డి ప్రారంభించారు. అనంతరం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ ఆప్‌ద్వారా పిర్యాదుచేస్తే అత్యంత వేగవంతంగా పోలీస్‌శాఖ రంగంలోకి దిగుతుందని అన్నారు. సంఘటన జరిగే పోలీస్‌స్టేషన్ పరిధికి తగిన సమాచారం చేరుకుంటుందని వెనువెంటనే పోలీస్ అధికారులు, సిబ్బంధి రంగంలోకి దిగి నేరాలను అరికట్టడం జరుగుతుందని ఐజీపీ నాగిరెడ్డి అన్నారు.

ఈ ఆప్‌ను విద్యార్థిణిలు కానీ, యువతులు కానీ, మహిళలు కాని ప్రజలెవరైనా గూగుల్‌లోని హాక్‌ఐ ఆప్‌ను నిర్భయంగా వినియోగించుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ముందుగా హైద్రాబాద్ సిటీ పోలీస్‌శాఖ ఈ ఆప్‌ను వినియోగిస్తూ, అనేక నేరాలను అరికట్టుతున్నదన్నారు. హాక్‌ఐ ఆప్‌లో పొందుపరిచిన 8రకాల విభాగాలు ఉంటాయని వీటిలో ఏదైన ప్రజలు వినియోగించుకునేందుకు సౌకర్యాన్ని మెరుగుపరచడం జరిగిందని అన్నారు. గృహాల్లో పనిచేస్తూ, దొంగతనాలకు పాల్పడుతుంటారని అన్నారు. ఇండ్లలో పనిచేసే వారితో పాటు అద్దెకుంటున్న వారి వివరాలను ముందే పొందుపరుచుకోవడం మంచిదని ఐజీపీ అన్నారు. మహిళలు ప్రయాణంలో ఉన్నప్పుడు ఆటోలు గానీ, తదితర వాహనాల ద్వారా ఆయా డ్రైవర్లు రూటుమార్చి కిడ్నాపింగ్‌లకు పాల్పడే అవకాశాలు ఉన్నాయని ఇటువంటి సమయంలో ఈ హాక్‌ఐ అనే ఆప్‌ను నొక్కడంతోనే పోలీస్ వ్యవస్థ రంగంలోకి దిగుతుందని అన్నారు.

ఈ ఆప్‌లో వారి వారి సన్నిహితులు, బందువులు ఐదుగురి ఫోన్‌నెంబర్లను కూడా అత్యవసర సేవలకోసం ఫీడ్‌చేసుకోవాలని అన్నారు. ఈ ఆప్‌ద్వారా ఫోన్‌లలో నెట్ లేనివారు వినియోగిస్తే ఎస్‌ఎంఎస్ సమాచారం కూడా పోలీస్‌శాఖకు చేరుతుందని అన్నారు. ఆప్ ఉన్న ఫోన్‌లలో నెట్‌ఉంటే దారితప్పిపోయిన వారు కూడా ఆప్‌ను నొక్కగానే తప్పిపోయిన వారికోసం రూట్‌మ్యాప్ మీకు సహరిస్తుందని ఈ ఆప్‌ను వినియోగించుకోవాలని అన్నారు. రామగుండం పోలీస్ కమీషనర్ పరిధిలోని ప్రజలు ఈ ఆప్ సేవలను వినియోగించుకోవాలని ఐజీపీ వై.నాగిరెడ్డి అన్నారు. మహిళలు సురక్షిత ప్రయాణం కోసం, ట్రాఫిక్ ఉల్లంఘన, నేరాలు జరుగుతున్న నేరాలపై సమచరించుటకు, మహిళలకు సంబంధించిన నేరాల గురించి పోలీసుల ఉల్లంఘనపై పిర్యాధులు, పోలీసులు చేసే మంచి పనుల గురించి సమాచారం ప్రజల ఇండ్లలో ఉండే వర్కర్స్, అద్దెకు ఉండే వారి వివరాలు పోలీసుల వద్ద నమోదు వివరాల గురించి, పోలీసు అధికారుల ఫోన్‌నెంబర్ల గురించి, ఫిర్యాధు యోక్క వివరాలు తెలుసుకొనుటకు ఈ హాక్‌ఐ ఆప్ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ ఆప్‌ద్వారా పంపినటువంటి సమాచారం ఎప్పటికప్పుడు సంబంధిత ఎస్‌ఐ, సీఐ, ఎసీపీ తదితర అధికారుల పెట్రోలింగ్ మొబైల్‌కి, కంట్రోల్ రూంకు చేరును. అట్టి సమాచారం పొందిన వెంటనే స్పంధించి వెంటనే అట్టి నేరస్థలానికి చేరుకొని సత్వర చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఐజీపీ నాగిరెడ్డి అన్నారు.

ఈ సమావేశంలో రామగుండం పోలీస్ కమిషనర్ విక్రమ్‌జిత్ దుగ్గల్ మాట్లాడుతూ ఈ ఆప్‌తో పోలీస్ సేవలను వినియోగించుకొని పోలీసు వారిపై నమ్మకాలు పెంచుకోవచ్చని అన్నారు. ఈవ్ టీజీంగ్ తదితర నేరాలకు పాల్పడిన ఈ ఆప్‌ను వినియోగించు కోవచ్చునని అన్నారు. అనంతరం ఐజీపీ నాగిరెడ్డి, రామగుండం సీపీ విక్రమ్‌జిత్ దుగ్గల్‌లు మొక్కలను నాటారు. అనంతరం పోలీస్ సిబ్బంధితో మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డీసీపీ విజేందర్‌రెడ్డి, మంచిర్యాల్ డీసీపీ జాన్‌వెల్సిలి, పెద్దపల్లి ఏసీపీ సింధూశర్మ, గోదావరిఖని ఏసీపీ అపూర్వరావు,  పెద్దపల్లి సీఐ ఎడ్ల మహేష్, ప్రభాకర్, వెంకటస్వామి, క్రిష్ణ, సుల్తానాబాద్ సీఐ అడ్లూరి రాములు, సుల్తానాబాద్ ఎస్‌ఐలు బి.జీవన్, దేవేందర్, తదితర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Comments

comments