Home జాతీయ వార్తలు హజారేకు బెదిరింపు లేఖ

హజారేకు బెదిరింపు లేఖ

ANNA_manatelanganaఢిల్లీ : సామాజికవేత్త అన్నాహజారేకు బెదిరింపు ఉత్తరం వచ్చింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు దూరంగా ఉండాలని ఆ బెదిరింపు ఉత్తరంలో దుండగులు పేర్కొన్నారు. ఆ ఉత్తరంపై ఆగస్టు 7వ తేదీ ముద్ర వేసి ఉందని, లేఖ మొత్తం ఇంగ్లిషులోనే రాసి ఉందని పోలీసులు తెలిపారు. 2013లో పూణెలో అన్నాహజారే ఇంటికి సమీపంలో హేతువాది నరేంద్రదాబోల్కర్ అనే వ్యక్తి హత్యకు గురయ్యాడు. అదేవిధంగా మళ్లీ జరుగుతుందని హజారేకు రాసిన ఉత్తరంలో దుండగులు పేర్కొన్నారు. సెక్షన్ 506కింద కేసు నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు.