Home తాజా వార్తలు నా తమ్ముడికి ఉరి కంటే పెద్ద శిక్ష వేయండి: శ్రీనువాస్ రెడ్డి అన్న

నా తమ్ముడికి ఉరి కంటే పెద్ద శిక్ష వేయండి: శ్రీనువాస్ రెడ్డి అన్న

Srinivas Reddy

 

యాదాద్రి: బొమ్మరామారం మండలం హజీపూర్ గ్రామంలో సైకో శ్రీనివాస్ రెడ్డి ముగ్గురు అమ్మాయిలను బావిలోకి నెట్టేసి అనంతరం వారిపై అత్యాచారం చేసి హతమార్చిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ రెడ్డి తండ్రి బాల్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అమ్మాయిలపై పాశవికంగా లైంగిక దాడి చేసి హత్య చేసిన తన కుమారుడు శ్రీనివాస్ రెడ్డిని ఉరి తీయాలని నిందితుడి తండ్రి బాల్ రెడ్డి తెలిపారు. తన చిన్న కుమారుడు ఇలాంటి నేరాలకు పాల్పడుతాడని ఎప్పుడు తాము ఊహించలేదన్నారు. కర్నూల్‌లో మర్డర్ కేసులో శ్రీను ఇరుక్కున్నప్పుడు తాను, తన పెద్ద కుమారుడు సుధాకర్ రెడ్డి కలిసి విడిపించామన్నారు. శ్రీనివాస్ రెడ్డి సోదరుడు సుధాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. శ్రావణి హత్య జరిగిన రోజు పోలీసులు వచ్చినప్పుడు అందరం బావి వద్ద ఉన్నామని, అప్పుడు సైకో శ్రీను ముఖంలో ఎలాంటి భయాందోళనలు కనిపించలేదన్నాడు. తన తండ్రిని, తనని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నప్పుడు పోచంపల్లి మండలం రావిరాలలో శ్రీనివాస్ రెడ్డి బంధువుల ఇంట్లో దాక్కుంటే తామే పట్టించామని తెలిపారు. శ్రీనివాస్ రెడ్డికి ఉరి కంటే పెధ్ద శిక్ష వేయండని సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. 

 

Hazipur Murders: Government Kill to Srinivas Reddy
Hazipur Murders: Government Kill to Srinivas Reddy