Home తాజా వార్తలు శ్రీనివాస్ రెడ్డి… ఆ దంపతులేరి?

శ్రీనివాస్ రెడ్డి… ఆ దంపతులేరి?

Srinivas Reddy

యాదాద్రి భువనగిరి: హాజీపూర్ వరుస హత్యకేసులో మరో మలుపు తిరిగింది. సైకో కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి అఘాయిత్యాలకు ఆధారాలు బయటపడుతున్నాయి. నిందితుడి వద్ద బాలికల ఆధార్ కార్డులు, స్కూల్ ఐడి కార్డులు లభ్యమయ్యాయి. హాజీపూర్ కేసులో దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. తవ్వుతున్న కొద్దీ శ్రీనివాస్ రెడ్డి అఘాయిత్యాలు రోజుకొకటి బయటపడుతున్నాయి. శ్రీనివాస రెడ్డి స్మార్ట్ ఫోన్‌లో పోర్న్ చిత్రాలు ఎక్కువగా చూసేవాడని సెర్చ్ హిస్టరీలో తెలిసింది. శ్రీనివాస్‌రెడ్డి దగ్గర దంపతులు పని చేసేవారని కానీ వారు ఇప్పుడు కనిపించడంలేదని గ్రామస్థులు వాపోయారు. శ్రీనివాసరెడ్డి లిఫ్ట్ మెకానిక్‌గా పని చేసిన ప్రదేశాలలో జరిగిన హత్యలు, మిస్పింగ్ కేసులపై పోలీసులు విచారణ చేస్తున్నారు. శ్రీనివాస రెడ్డి తన బావిలో ముగ్గురు అమ్మాయిల పడేసి అనంతరం వారిపై అత్యాచారం చేసి హతమార్చిన కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. 

 

Hazipur Murders: Psycho Srinivas reddy Murders