Home తాజా వార్తలు బోరున విలపించిన ముఖ్యమంత్రి

బోరున విలపించిన ముఖ్యమంత్రి

Kumara-Swamy

బెంగళూరు: జనతాదళ్‌ పార్టీ ఏర్పాటు చేసిన సన్మాన కార్యకమ్రంలో కర్నాటక ముఖ్యమంత్రి కుమారస్వామి బోరున విలపించారు. నాకు సిఎం పదవి వచ్చినా ఆనందంగా లేనని జనతాదళ్ కార్యకర్తలు మాత్రమే ఆనందంగా ఉన్నారని తెలిపారు. రైతుల బాధలు తీర్చాలనే ఉద్దేశంతో రుణమాఫీ చేశానని, కానీ ప్రజల నుంచి ఆశించిన స్థాయిలో విశ్వాసం రావడం లేదని వాపోయారు. ఆర్థికంగా ప్రభుత్వానికి పెనుభారమైన ఈ పథకాని అమలు చేశానని, ఈ పరిస్థితులలో ప్రజలపై పన్నుల భారాన్ని మోపానని వివరించారు. సంకీర్ణ ప్రభుత్వంలో తన పరిస్థితి గరళాన్ని మింగిన శివుడిలా ఉందని తన బాధను వ్యక్తం చేశారు. ప్రజల విశ్వాసాన్ని పొందిన రోజే సత్కారాలు చేయించుకుంటానని ఏడుస్తూ చెప్పారు. ముఖ్యమంత్రి కన్నీరు పెడుతున్నప్పుడు అక్కడ ఉన్న కార్యకర్తలు సర్ మీరు ఏడ్వకండి మీ వెంట మేము ఉన్నామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ఆయన సోదరుడు హెచ్ డి రేవణ్ణ, పార్టీ కార్యధ్యక్షుడు ప్రజ్వలరేవణ్ణతో పాటు పలువురు మంత్రులు హాజరుకాలేదు.