Search
Friday 21 September 2018
  • :
  • :
Latest News

హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ లాభం రూ.2870 కోట్లు

  • 20.5 శాతం పెరిగిన నికర లాభం
  • అంచనాలను అందుకున్న బ్యాంక్

HDFC-Bankముంబయి : ప్రైవేటు రంగ సంస్థ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ గురువారం రెండో త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో బ్యాంకు లాభం రూ.2,869.5 కోట్లతో 20.5 శాతం పెరిగింది. గత సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంకు లాభం రూ.2,381.5 కోట్లుగా ఉంది. బ్యాంకు మొత్తం ఆదాయం రూ.13,894.7 కోట్ల నుంచి రూ.17,324.3 కోట్లకు పెరిగింది. పన్నుకు రూ.1,492.2 ఏర్పాటు చేసిన తర్వాత లాభం రూ.2,869.5 కోట్లుగా ఉందని బిఎస్‌ఇ పైలింగ్‌లో హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ వెల్లడించింది. స్థూల ఎన్‌పిఎ(నిరర్థక ఆస్తులు) గత సంవత్సరంలో 1 శాతం నుంచి స్వల్పంగా తగ్గుముఖం పట్టి 0.9 శాతానికి చేరుకున్నాయి. నికర ఎన్‌పిఎ 0.2 శాతంగా ఉంది. క్యూ2లో నికర వడ్డీ ఆదాయం రూ.6,680.9 కోట్లతో 21.2 శాతం పెరిగింది. నికర ఆదాయం త్రైమాసికంలో రూ.9,232.7 కోట్ల నుంచి 22.2 శాతం వృద్ధిని సాధించింది. ఇతర ఆదాయం(వడ్డీ యేతర ఆదాయం) రూ.2,551.8 కోట్లతో 27.6 శాతం పెరిగింది. ఆపరేటింగ్ వ్యయం రూ.4,189.8 కోట్లతో 19.8 శాతం పెరిగింది. బ్యాంక్ సిఎఆర్ గతంలో 9 శాతం నుంచి 15.5 శాతానికి పెరిగింది. బ్యాంకుకు డిస్ట్రిబ్యూషన్ నెట్‌వర్క్ 4,227 బ్యాంకులు, 11,686 ఎటిఎంలు ఉన్నాయి. బాంబే స్టాక్ ఎక్సేంజ్‌పై బ్యాంకు షేరు రూ.1,092.65 వద్ద ట్రేడ్ అయింది.

Comments

comments